Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు మా సాయాన్ని తిరస్కరించారు:రష్యా షాకింగ్ కామెంట్స్

మా సాయాన్ని తిరస్కరించారు:రష్యా షాకింగ్ కామెంట్స్

flag russia big

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను రష్యా  విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో దశ మానవ ప్రయోగాలు జరపకుండా ఈ వ్యాక్సిన్ విడుదల కావడంతో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ భద్రత మరియు సమర్థతపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నివేదికల్లో “స్పుత్నిక్ వి” లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సరైన పరీక్షలు జరపకుండా వ్యాక్సిన్ విడుదల చేయడం వలన మానవాళికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా ఈ రెండు దేశాలకు సంబంధించిన ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.

వ్యాక్సిన్ కు సంబంధించిన రీసెర్చ్ మరియు సమాచారాన్ని బదలాయింపు కోసం ప్రపంచ దేశాలన్నీ ‘రాప్‌ స్పీడ్‌’ అనే ఆపరేషన్‌ ను ప్రారంభించాయి. ఇందులో రష్యా కూడా పనిచేస్తుంది. రష్యన్ తమ టీకాను విడుదల చేయడానికి ముందు అమెరికాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ అమెరికా శాస్త్రవేత్తలు దాన్ని తిరస్కరించాలని రష్యా అధికారులు సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వానికి రష్యా పై ఉన్న అనుమానం మరియు మా సాంకేతిక పరిజ్ఞానంపై నమ్మకం లేకపోవడం లేదా అపనమ్మకం కారణంగానే  మా టెక్నాలజీని వారు ఉపయోగించరని తెలిపారు. దీనిపై స్పందించిన అమెరికా అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. “అమెరికా తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన చేస్తున్నారు. ప్రస్తుతం మా వ్యాక్సిన్ మూడో దశలో ఉంది. ఇందులో మేము తప్పకుండా తాము విజయం సాధిస్తామని ”వైట్‌హౌస్ ప్రెస్‌ కార్యదర్శి కెయిలిగ్ మెక్నాని ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యా కోజీ బేర్‌ అనే నిఘా సంస్థ ద్వారా  ప్రపంచ దేశాల పరిశోధన సమాచారాన్ని తిరస్కరిస్తుందని బ్రిటన్ ఆరోపణలు చేసింది. Brittle వ్యాఖ్యలను సమర్థిస్తూ అమెరికా, కెనడాలు మద్దతు తెలిపాయి. మరోవైపు, బ్రిటన్ ఆరోపణలను రష్యా తిరస్కరించింది. ఇవన్నీ నిరాధరమైన ఆరోపణలని కొట్టిపారేసింది.ఏదిఏమైనప్పటికీ ప్రపంచంలోని రెండు అగ్ర దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైందన్నది నిజం .

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad