Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఆ రంగానికి రూ.23 లక్షల కోట్లు నష్టం.. ఎందుకో తెలుసా?

ఆ రంగానికి రూ.23 లక్షల కోట్లు నష్టం.. ఎందుకో తెలుసా?

Tourism Sector Huge Loss With Corona Effect

ప్రపంచాన్ని వణికిస్తు్న్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. అయితే కరోనాను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు పూర్తి లాక్‌డౌన్‌ను విధించాయి. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కాగా ఇందులో పర్యాటక రంగం కూడా భారీ ఎత్తున నష్టాలను చవిచూస్తోంది.

ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రదేశాలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కూడా ప్రజలు తమ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వారు ఎలాంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించడం లేదు. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కీలక సమాచారాన్ని వెల్లడించింది. యావత్ ప్రపంచంలో తీవ్ర సంక్షోభం నెలకొందని, ఇందులో ఎక్కువగా నష్టాలను చవిచూసింది పర్యాటక రంగం అని తెలిపింది. ఈ ఏడాది తోలి ఐదు నెలల్లో ఏకంగా 320 బిలియన్ల డాలర్లు అంటే 23 లక్షల కోట్ల రూపాలయ నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

అటు ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని, ఇప్పటికే చాలా మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. కాగా ఈ పర్యాటక రంగం మళ్లీ పుంజుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన రంగాల్లో పర్యాటక రంగం కూడా ఒకటని తేలిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad