Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు అక్కడ స్కూల్ ఓపెన్ చేశారు...అంతే మొత్తం మటాష్

అక్కడ స్కూల్ ఓపెన్ చేశారు…అంతే మొత్తం మటాష్

NXKZY2VH4SGLNPB66CNFAEGY4A

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. భారత్, అమెరికా, రష్యాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ మహమ్మారి అన్ని వ్యవస్థల పైన ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పై కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం వ్యర్థమైపోయింది. దీంతో కొన్ని దేశాలు పాఠశాలలను పునఃప్రారంభించడానికి సిద్ధం అవుతున్నాయి. తాజాగా అమెరికాలోని  ఫ్లోరిడా రాష్ట్రంలో పాఠశాలను పునఃప్రారంభించారు. పాఠశాలలు తెరుచుకోవడంతో గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా విద్యార్థులు ఎంతో ఆనందంగా స్కూళ్లకు పరుగుతీశారు. అయితే ప్రభుత్వం ఒకటి అనుకోగా వాస్తవ పరిస్థితుల్లో మరొకటి జరిగింది.

ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కరోనా ఉధృతి భారీగా పెరిగింది. గడిచిన మూడు నెలలు కంటే కేవలం ఆగస్టు నెలలో కరోనా కేసుల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఆగస్టు 24 నాటికి ఫ్లోరిడాలో 39,800  కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, పాఠశాల తెరచుకున్న తర్వాత వాటి సంఖ్య 49,000 వేలకు చేరింది. అంటే కేవలం ఇరవై రోజుల్లో అంటే 9వేల 200ల కేసులు పెరిగాయి. ఇది సాధారణ వైరస్ వ్యాప్తి కంటే నాలుగు రెట్లు అధికం. ఫ్లోరిడా డి పార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఇటీవల విడుదల చేసిన పీడియాట్రిక్ నివేదిక ప్రకారం.. 14 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న 36% పిల్లలకు కరోనా సోకింది. వీరిలో ప్రస్తుతం 650 మంది అత్యవసరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమెరికా లాంటి అగ్ర రాజ్యంలోనే ఈ స్థితిలో ఉంటే భారత్ లాంటి ఇరుకు గదులు ఉన్న పాఠశాల్లో పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహకు కూడా అందడం లేదు. అక్టోబర్ నుండి కేంద్రం అన్ లాక్ 4.0 ను  అమలు చేయనుంది. పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ప్రకారం మెట్రోరైళ్ళు, పాఠశాలలు తెరుచుకుని అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే గాని జరిగితే వైరస్ విజృంభణను అదుపు చేయడం దాదాపు అసాధ్యం. ప్రపంచవ్యాప్త కరోనా కేసుల్లో భారత్‌ వాటా 13 శాతం పైగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 33,87,501 కరుణ కేసులు నమోదు కాగా, 25,83,948 మంది కోలుకున్నారు. ప్రస్తుతం7,42,023 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ అదేస్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉండటంతో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad