Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ: ఇండియా కు జై కొట్టిన సౌదీ

పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ: ఇండియా కు జై కొట్టిన సౌదీ

mbs khan 2019 Bandar al Jaloud Saudi Royal Palace afp

దాయాది దేశం పాకిస్థాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇస్లామిక్ స్టేట్ సౌదీ అరేబియా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు నిరాకరించారు. 2019 నుంచి సౌదీ అరేబియా భారత్ తో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సౌదీని హెచ్చరించడంతో సౌదీ యువరాజు బజ్వాను కలవడానికి సమయం ఇవ్వకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ 370డిని రద్దు చేసి స్వయంప్రతిపత్తిని తొలగించడంతో  పాకిస్తాన్ ఒక్కసారిగా కంగుతింది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదకు తీసుకు వెళ్లడానికి పాకిస్తాన్ సౌదీ అరేబియా సాయాన్ని కోరింది అయితే సౌదీ కశ్మీర్ సమస్య విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో పాటు అది భారత అంతర్గత విషయం అని తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ సౌదీకి వార్నింగ్ ఇచ్చారు.

కాశ్మీర్ విషయంలో సౌదీ ముందుండి నడిపించాలని పాకిస్థాన్ కోరింది. ఒకవేళ సౌదీ రాకుంటే ఇతర ఇస్లామిక్ స్టేటస్ తో కలిసి భారత్‌పై ఒత్తిడి పెంచాలనే పాక్ అనుకుంది. కానీ సౌదీ, యూఏఈ సహా ఇతర ఇస్లామిక్ దేశాలు ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పాయి. ఈ తరుణంలోనే పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు సౌదీ అరేబియాకు ఆగ్రహం తెప్పించాయి. 2018లో సౌదీ ప్రకటించిన 6.2 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలో.. 1 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని పాకిస్తాన్ ని సూచించింది. దీంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ చైనా నుండి అప్పులు తీసుకువచ్చి సౌదీకి చెల్లించింది.

వీటితో పాటు సౌదీ నుంచి దిగుమతి చేసుకున్నా 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురు ప్రధాని కూడా త్వరగా చెల్లించాలని ఒత్తిడి చేసింది. పరిస్థితులు ఒక్కసారిగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మారటంతో ఐఎస్ఐ చీఫ్‌తో కలిసి పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా సోమవారం రియాద్ వెళ్లారు. కానీ సౌదీ యువరాజు వారిని కలవకపోవడంతో.. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ భేటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చైనా దాని మిత్రదేశాలు తప్ప ఇతర దేశాలు  భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడకపోవటంతో ఈ దాయాది దేశాల ఆగ్రహంతో రగిలి పోతున్నాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad