Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనాను అంతం చేసే బ్రహ్మాస్త్రం...జపాన్ ఘనత

కరోనాను అంతం చేసే బ్రహ్మాస్త్రం…జపాన్ ఘనత

coronavirus blue 1

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ను అంతం చేసే నూతన విధానాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి రక్షణగా ఉండే ఓజోన్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా పుజిటా హెల్త్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఓజోన్ వాయువు ద్వారా కరోనాని నిలువరించే అవకాశం ఉందని వీరు గుర్తించారు. ఈ వాయువులు మానవాళికి హాని చేయనంత స్థాయిలోనే ఈ వైరస్ ను అంతం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువు కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించగలిగే శక్తి కలిగి ఉందని వారు తెలిపారు. 0.05 నుంచి 0.1 పీపీఎం స్థాయిలో ఓజోన్ వాయువును ఉపయోగించి వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని వివరించారు.

ఆసుపత్రులు, కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. ఈ ప్రయోగాన్ని మూసివేసిన ఒక గదిలో నిర్వహించారు. ఇందులో కరోనా నమూనాల ఉంచి దాదాపు 10 గంటలపాటు తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును వినియోగించారు. ఫలితంగా 90శాతం కరోనా వైరస్ తగ్గినట్టు గుర్తించారు. ఓజోన్ లో ఉండే ఆక్సిజన్ అణువులు వ్యాధికారక కరోనా వైరస్ ను క్రియారహితం చేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త తకయుకి మురాటా పేర్కొన్నారు. ఈ విధానాన్ని బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లు మరియు ఆసుపత్రిలో వినియోగించవచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా అధిక తేమ తో కూడుకున్న ప్రదేశాల్లో ఇది సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు.

1-6 పీపీఎం మధ్య ఉండే అధిక సాంద్రత గల ఓజోన్ వాయువు వైరస్ ను పూర్తిగా నాశనం చేస్తోంది. అయితే ఈ స్థితి వద్ద మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వాయువును ఉపయోగించి సర్జికల్ దుస్తులు, గాగుల్స్, ఇతర వైద్య రక్షణ సామాగ్రిని శుభ్రం చేయవచ్చని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad