Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ !

డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ !

coronavirus vaccine bottles

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కు ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలు జరుపుకుంటున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగ దశలోనే అద్భుతమైన ఫలితాలను గురించి నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ లైసెన్సింగ్‌ను పొందింది. ఇప్పటికే భారత్ కు చెందిన భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా సొంత వ్యాక్సిన్  తయారీలో ముందు వరుసలో ఉన్నాయి. 

భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ కు ఐసీఎంఆర్‌ మరియు ఎన్ఐవి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సహాయం  అందిస్తున్నాయి.  కోవాగ్జిన్‌ ప్రస్తుతం తొలి దశ క్లినికల్‌ పరీక్షలను  పూర్తి చేసుకుంది. మరోవైపు  జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్‌-డి సైతం తొలి దశ పరీక్షలలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ను ఇప్పటికే పదహారు వందల మంది పై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

ఈ ప్రయోగాలు దేశంలోని 17 ప్రాంతాల్లో 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో జరుపుతున్నట్లు తెలిపింది. పరీక్షలు పూర్తయిన తర్వాత నెలకు 10 కోట్ల డోసేజీలను అందించనున్నట్లు సీరమ్‌ తెలిపింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ 100 మిలియన్ డాలర్లను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ కు చెల్లించింది. తద్వారా వ్యాక్సిన్ ₹250 లోనే లభించనుంది. మరోవైపు భారత్ కంపెనీలు కూడా  1,000-1100 మందిపై ప్రయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad