Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు సరికొత్త వ్యాక్సిన్: ముక్కు ద్వారా

సరికొత్త వ్యాక్సిన్: ముక్కు ద్వారా

AdobeStock 270886213
Vaccines, botulinum toxin and insulin ampules concept theme with glass vials with clear liquid next to a syringe and a hypodermic needle isolated on white background

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధిలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రైల్ దశలో ఉండగా మరికొన్ని మానవ ప్రయోగ దశలోనే ఉన్నాయి. తాజాగా  వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.  ఈ వ్యాక్సిన్ను ఎలుకలపై ప్రయోగించి గా సమర్థవంతంగా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని పరిశోధకులు ప్రకటించారు. ఎలుకలు నాసికా ముఖ ద్వారం ద్వారా ఈ వ్యాక్సిన్ను అందించగా శ్వాస మార్గంలో వైరస్ తీవ్రత తగ్గడంతో పాటు శరీరంలోకి ఇన్ఫెక్షన్లు చేరకుండా 

అడ్డుకుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాలను జనరల్ సెల్‌ ప్రచురితం చేసింది. సాధారణ జలుబును కలిగించే ఎడిన్ వైరస్ లో కరోనా వైరస్ స్పైక్  ప్రోటీను చొప్పించి ఆ వైరస్ ఎలుక శరీరంలో ప్రవేశపెట్టారు. తరువాత ఎలుకలకు వ్యాక్సినేషన్ చేయగా అవి ప్రమాదం నుంచి బయట పడ్డాయి అని తెలిపారు. మొదట్లో పరిశోధకులు వాటికి ఇంజెక్షన్ రూపంలో ఈ వ్యాక్సిన్ ఇవ్వగా.. ఇంజెక్షన్ న్యుమోనియాను నిరోధించింది కానీ ముక్కు, ఊపిరితితుల్లో ఇన్ఫెక్షన్‌ను నిరోధించలేకపోయింది. కానీ ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ మాత్రం సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తించారు. తరువాత ప్రయోగాలను జంతువులు మరియు మానవులపై నిర్వహించడానికి పరిశోధకులు సిద్ధమవుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad