Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కమల హారిస్ అమెరికా గేమ్ చేంజర్ !

కమల హారిస్ అమెరికా గేమ్ చేంజర్ !

Kamala harris game changer
Kamala harris game changer

డెమొక్రాట్టిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా “కమల హారిస్” పేరును ప్రకటించిన వెంటనే అమెరికా రాజకీయాలు ఒక్కసారిగా కుదుపుకు లోన్నాయి. డెమొక్రాట్టిక్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చూసి డోనాల్డ్ ట్రంప్ షాక్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కమల హారిస్ పేరే వినిపిస్తుంది. అసలు ఎవరు ఈమె ? రిపబ్లికన్ పార్టీ ఈమెను చూసి ఎందుకు భయపడుతుంది ? జో బిడెన్ కు కమల హారిస్ పై ఉన్న నమ్మకం ఏంటి ?

కమలహారిస్ ఎవరు ?

కమల హారిస్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ది తమిళనాడు కాగా తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ది జమైకా. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కలయిక  అమెరికాలోని బర్కిలీ యూనివర్సిటీలో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.ఇందులో మొదటి ఆమె కమలా హారిస్‌. కమలా  హోవర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తరువాత ‘హేస్టింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లా’ నుంచి న్యాయ విద్య పూర్తిచేశారు. అమెరికా రాజకీయాల్లో కమల పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, శాన్‌ఫ్రాన్సిస్కో డిస్టిక్ అటార్నీగా పనిచేసారు. ఈ రెండు పదవుల్ని అధిరోహించిన మొదటి నల్లజాతి తొలి మహిళ ఈమె కావడం విశేషం. కమల భర్త డగ్లస్‌ ఎంహాఫ్‌ అమెరికాలో పేరుమోసిన న్యాయవాది. 

జో బిడెన్ రాజకీయ వ్యూహం :

2016 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవవలసి ఉండగా చివరి క్షణంలో  డెమొక్రటిక్ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ హిల్లరీ క్లింటన్‌ ఓటమి తరువాత రిపబ్లికన్ పార్టీ భారీ కసరత్తు చేసింది. ప్రస్తుతం అమెరికాలో నల్లజాతీయుల పై దాడులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతో అమెరికా ఒక్కసారి ఉలిక్కి పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్షపాత వైఖరి అవలంబించడంతో అగ్నికి ఆహుతి తోడైంది. మరోవైపు అమెరికాలో భారతీయ ఓట్లు కూడా అత్యంత ముఖ్యమైనవి. దాదాపు 8 శాతం ఉన్న ఈ ఓట్లు అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయగలవు. కమలా హారిస్ భారతీయ సంతతికి చెందిన మహిళ మరియు నల్లజాతీయురాలు.  దీనితో భారతీయ ఓట్లు రిపబ్లికన్ పార్టీకే పడే అవకాశం ఎక్కువ. కాలిఫోర్నియా హై ప్రొఫైల్ సెనెటర్ కమలా ఒకరు. ఇమేకు అద్భుతమైన వాక్చాతుర్యం, ప్రజలను కలుపుకొనిపోయే నైపుణ్యం ఉంది. అమెరికాలోని పేరుపొందిన నేతల్లో కమలా ఒకరు. తను ఏ విషయంలోనూ రాజీ పడక ధైర్యంగా పోరాడటంలో ఆమెకు ఆమే సాటి అని ట్రాక్ రికార్డు ఉంది. నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పేరే అధ్యక్ష రేసులో ఉండగా 2019 డిసెంబర్‌లో ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. తర్వాత మార్చిలో జో బిడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆమె ప్రతిభను గుర్తించిన జో బిడెన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రకటించి ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు.కమలహారిస్ అమెరికాలో భారీ మద్దతు ఉంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్ నల్లజాతీయులు ఆమె వెంట నడవడం ఖాయమని అమెరికా పత్రికలు ప్రకటించాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల చూస్తున్నట్లయితే కమల హారిస్  కమల హారిస్ గేమ్ చేంజర్ గా కనిపిస్తుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad