Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనా కట్టడిలో విజయం సాధించిన జపాన్

కరోనా కట్టడిలో విజయం సాధించిన జపాన్

jpg 11

ప్రపంచం మొత్తం కరోనాతో అట్టుడుకుతుంటే జపాన్ లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో జపాన్ నగరాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఆగస్టు 20 నాటికి జపాన్ లో మొత్తం 60 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధాని టోక్యోలో దాదాపు 3 కోట్ల 80 లక్షల మంది నివసిస్తున్నారు. అయితే అక్కడ కేవలం 19 వేల మందికి మాత్రమే కరోనా సోకింది. టోక్యోలో ప్రతి 84 గజాలకు ఒకరు చొప్పున నివసిస్తుండగా అమెరికాలోని న్యూయార్క్‌ పట్టణంలో  24 గజాలకు ఒకరు చొప్పున నివసిస్తున్నారు. టోక్యోతో పోలిస్తే న్యూయార్క్ లో జనసాంద్రత చాలా తక్కువ. అయినప్పటికీ న్యూయార్క్ లో 4,56,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రజల క్రమశిక్షణ. జపాన్ లో భవన నిర్మాణం నుండి వైద్య సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు శాస్త్ర సాంకేతిక విధానాన్ని సరిగ్గా వినియోగించుకోవడంతో జపాన్ లో కరోనా కట్టడి సాధ్యమైంది. టోక్యోతో పాటు జపాన్ లోని ఇతర నగరాలు కూడా వైరస్ ఫ్రీ సిటీలు గానే  కొనసాగుతున్నాయి. ఇప్పటికే క్యోటో, ఒసాకా లాంటి నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. రైలు సిబ్బంది బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైల్లో ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తున్నారు. మెజారిటీ ధనవంతులు కూడా సొంత వాహనాలను విడిచిపెట్టి వీటి ద్వారానే ప్రయాణం చేస్తున్నారు.

జపనీయులు క్రమశిక్షణకు మారుపేరు. వాస్తవానికి జపాన్ ఫుట్‌పాత్‌లపై ఎలాంటి వ్యాపారాలకు అనుమతి లేదు. దీంతో ప్రజలు స్వేచ్ఛగా ఫుట్‌పాత్‌లపై నడుచుకుంటూ వెళ్తారు. భారత్ లో దీనికి భిన్నంగా ఉంటుంది. జపాన్ లో రెస్టారెంట్లు, అతిధి హోటళ్ళు 24 గంటల పాటు తెరుచుకుని ఉంటాయి. దీంతో భారీ రద్దీ ఉండే అవకాశం లేదు. జపనీయులకు మొదటి నుండే మాస్కులు ధరించి ఆనవాయితీ ఉంది. అంతే కాకుండా అక్కడి ప్రజలు క్యూ పద్ధతులు పాటించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ ని మొదటి నుండి అవలంభిస్తున్నారు. ఇటువంటి చర్యలు కారణంగానే జపాన్ లో కరోనా కేసులు తక్కువుగా నమోదవుతున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad