Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు జిత్తుల మారి నక్క..చైనా దుస్సాహసం

జిత్తుల మారి నక్క..చైనా దుస్సాహసం

china 1
Mixed China and India flag, three dimensional render, illustration

చైనా ఒకవైపు శాంతి మంత్రాన్ని జపిస్తూనే మరోవైపు యుద్ధోన్మాదంతో రగిలిపోతుంది. సరిహద్దుల వెంబడి చైనా సైన్యం దుందుడుకుగా ప్రవర్తిస్తుంటే చైనా పాలకులు మాత్రం కొత్త వాదనను అందుకున్నారు. తాజాగా చైనా-ఇండియా యూత్ వెబినార్‌లో ప్రసంగించిన చైనా రాయబారి సన్ వీయ్‌డంగ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. “భారత్ ను తాము మిత్రుడిగా పరిగణిస్తున్నామని. భారత్ మాకు మంచి వ్యాపార భాగస్వామని, పొరుగు దేశాన్ని ముప్పుగా కంటే మంచి అవకాశంగా భావిస్తున్నామని”  వీయ్‌డంగ్ అన్నారు.

ఇరు దేశాల సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులు త్వరలోనే సమసిపోతాయని దానికోసం ఇరుపక్షాలు శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చలు జరపాలని సన్ వ్యాఖ్యానించారు. గల్వాన్ సంఘటన  దురదృష్టకరమని సన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగాలని భారత్, చైనా కోరుకోవడం లేదన్నారు. ఈ వీడియోని చైనా ఆగస్టు 18న రికార్డ్ చేయగా నేడు విడుదల చేసింది. భారత్ – చైనా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా హెలికాప్టర్లును మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. 

భారత్ కూడా పోర్టబుల్‌ ఇగ్లా క్షిపణుల్ని రంగంలోకి  దింపింది. వీటిని సైనికులు తమ భుజం మీద పెట్టుకుని శత్రువులపై దాడి చేయవచ్చు. శాంతియుత చర్చలతో పరిస్థితులు మారకపోతే సైనిక చర్యకు దిగుతామని భారత ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఎటువంటి ప్రగతిని కనబర్చలేదు. చైనా ఒకవైపు శాంతి మంత్రాన్ని చెబుతూనే మరోవైపు విస్తరణ వాదాన్ని కొనసాగించడాన్ని అమెరికా ఖండించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad