Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఫేస్ బుక్ అతి జోక్యం..వేటు పడనుందా?

ఫేస్ బుక్ అతి జోక్యం..వేటు పడనుందా?

29FACEBOOK01 videoSixteenByNineJumbo1600

సోషల్ మీడియా దిగ్గజంఫేస్ బుక్ వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. 2016లో కేంబ్రిడ్జ్ అనలిటిక డేటా లీక్ తర్వాత ఫేస్ బుక్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దేశాల్లో ఫేస్ బుక్ రాజకీయాలను మరియు ప్రజలను ప్రభావితం చేస్తుందని అనేకమంది ఆరోపిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో ఫేస్ బుక్ జోక్యం చేసుకోవడంతో మార్క్ జుకర్ బర్గ్ పై మేధావులు మండిపడ్డారు. ఆ తర్వాత భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఫేస్ బుక్ జోక్యం చేసుకునే ఆరోపణలు భారీగా వెల్లువెత్తాయి. దీనికి ప్రధాన కారణం ఫేస్బుక్ న్యూస్ బ్రాడ్ కాస్ట్. 2018లో ఫేస్బుక్ సంస్థ న్యూస్ షార్ట్ లిస్ట్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా న్యూస్ ని షేర్ చేసుకోవచ్చు. అయితే  ఈ ఫీచర్ ను వాడుకొని కొంత మంది నకిలీ వార్తలను పబ్లిక్ చేయడంతో పాటు వాటిని జోరుగా ప్రచారం చేశారు.

ఈ నకిలీ వార్తలను ఫేస్ బుక్ అడ్డుకట్ట వేయలేకపోయింది దీంతో  2018 జూన్ లో ఇన్స్టెంట్ ఆర్టికల్స్ ను తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఫేస్ బుక్ వేదికగా నకిలీ వార్తలు చలామణి అవుతున్నాయి. వీటినిఫేస్ బుక్ అడ్డుకట్ట వేయలేకపోయింది. ముఖ్యంగా జాతి విద్వేష వ్యాఖ్యలు మరియు హింసను ప్రేరేపించే వీడియోలు ఈ మాధ్యమం ద్వారా వేగంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇవి ప్రజలపై భారీస్థాయిలో ప్రభావం చూపడంతో పాటు ఎన్నికలను కూడా ప్రభావితం చేశాయి. కంటెంట్  మానిటరింగ్ లో ఫేస్ బుక్ సరిగ్గా వ్యవహరించడం లేదని పలు అంతర్జాతీయ పత్రికలు ఇప్పటికే విమర్శించాయి.

తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ భారత్ లో ఫేస్ బుక్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఓ కధనాన్ని ప్రచురితం చేసింది. నేడు జర్మనీ ఎన్నికల్లో కూడా ఫేస్ బుక్ జోక్యం చేసుకుంటుందనే మరో విశ్లేషణాత్మక కథనాన్ని పబ్లిష్ చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్ బుక్ ఈ కంటెంట్ ని మోడరేట్ చేయకపోయినట్లయితే ఈ అప్లికేషన్ పై బ్యాన్ పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad