Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు మరోసారి విషాన్ని కక్కిన చైనా : ట్రేడ్ వార్

మరోసారి విషాన్ని కక్కిన చైనా : ట్రేడ్ వార్

china vs

క్రితం వరకు అమెరికా చైనాల మధ్య ఉన్న ట్రేడ్ వార్ సరిహద్దులు వివాదాల కారణంగా చైనా – భారత్ మధ్య మొదలైంది. భారత సైనికుల పై దాడికి ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం 59 చైనా అప్లికేషన్లను బ్యాన్ చేయగా నేడు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భారత్‌లో తయారయ్యే ఆప్టికల్‌ ఫైబర్‌పై యాంటీ డంపింగ్‌ టారిఫ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ పనులు 7.4 శాతం ఉండగా నేటి నుంచి 30.6 శాతం దాకా ఉండనున్నాయి. ఈ సుంకాలు మరో ఐదేళ్ల పాటు అమల్లో వుండనున్నాయని డ్రాగన్ కంట్రీ తెలిపింది. కొత్తగా విధించిన ఈ సుంకాలు భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14  అర్ధరాత్రి నుండి అమలులో ఉంటాయని చైనా పేర్కొంది. ఈ ప్రకటనలో పలు భారతీయ కంపెనీల పేర్లను డ్రాగన్‌ ప్రస్తావించింది.

భారత్ చైనా, మలేషియా, తైవాన్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్న బ్లాక్‌టోనర్‌ పై భారీగా యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించాలని భారత్ ప్రతిపాదించిన నేపథ్యంలో చైనా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ గత నెల 23 న చైనా, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతయ్యే ఉక్కు​ ఉత్పత్తుల దిగమతులపై భారీగా యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. దీనికి ప్రతి చర్యగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ పత్రికలు ప్రకటించాయి. చైనా ఇప్పటికే అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తుంది. నేడు ఇటువంటి పరిస్థితి వస్తే డ్రాగన్ కంట్రీ భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad