
చైనా దేశానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు దేశాలు చైనా ఉత్పత్తులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అటు అగ్రరాజ్యం అమెరికా కూడా చైనాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను అమెరికా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చైనా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనికి తోడు మరోసారి చైనాకు చుక్కలు చూపెట్టేందుకు అమెరికా రెడీ అవుతోంది. విచాట్ అనే యాప్‌ను కూడా బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో చైనా అల్లాడుతోంది.
తాజాగా చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. తమ దేశానికి చెందిన విచాట్ యాప్‌ను నిషేధిస్తే, అమెరికాకు చెందని యాపిల్ ఐఫోన్లతో పాటు పలు ఉత్పత్తులను కూడా బ్యాన్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే చైనీయులు విచాట్ యాప్‌ను ఎప్పటికీ వదిలేయరని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది.
కాగా ఈ వివాదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందిచాల్సిన నాయకులు, ఇలా ఒక దేశానికి చెందిన వ్యాపారంపై నిషేధం విధించడం ఏమాత్రం సబబు కాదని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి యుద్ధ వాతావరణం ఇరుదేశాలకు మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.