Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు చైనా సరికొత్త డ్రామా!:ఆహార సంక్షోభం

చైనా సరికొత్త డ్రామా!:ఆహార సంక్షోభం

922377 662687 xi jinping reuters 1

సరిహద్దుల వెంబడి కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా సరికొత్త రాజకీయానికి తెరతీసింది. చైనీయుల్లో కమ్యూనిస్టు పార్టీపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుండటంతో జిన్ పింగ్ ‘క్లీన్ యువర్ ప్లేట్’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం చైనా ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. చైనాలో సగటున ప్రతి పదిమందిలో ముగ్గురు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి చైనా ప్రభుత్వం భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. తద్వారా తమ దేశం భారత్ పై విజయం సాధించిందని కమ్యూనిస్టు ప్రభుత్వ౦ స్వదేశంలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో మావో జెడాంగ్‌ కూడా ఇటువంటి విధానాన్ని అవలంబించారు. 1962లో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మావో ‘గ్రేట్‌ లీఫ్‌ పార్వర్డ్‌ మూమెంట్’‌ని ప్రారంభించాడు. దీని వలన కోట్ల మంది చైనీయులు అర్థాకలితో చనిపోయారు. ఆ సమయంలో కమ్యూనిస్టు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచనలను మళ్ళించడానికి డ్రాగన్ కంట్రీ 1962లో భారత్‌తో సరిహద్దు వివాదాన్ని ముందుకు తెచ్చింది. ఇప్పుడు చైనాలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటంతో మరోసారి చైనా ప్రభుత్వం పాత ధోరణి అవలంబిస్తోందని తెలుస్తోంది.

చైనాలో ఆహార సంక్షోభం:

ప్రస్తుతం చైనా ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించడంతో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడిందని అందుకే తక్షణం పౌరుల ఆహార అలవాట్లను నియంత్రించడంతో పాటు ఆహార భద్రత చట్టాన్ని అమలు పరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం ఎన్‌-1 విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం ఎవరైనా 10 మంది వ్యక్తులు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లినట్లుయితే సదరు రెస్టారెంట్ కేవలం తొమ్మిది మందికి మాత్రమే ఆహారాన్ని అందించాలి. ఒకవేళ వారు ఆర్డర్ చేసిన ఆహారాన్ని పూర్తిగా తినకుంటే దానిని పార్సల్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలి. ఇప్పటికే ఈ విధానం అమలులోకి వచ్చింది.

చైనా అధికారులు ఫుడ్‌ యూట్యూబర్లపై ఆంక్షలు విధించారు. ఆహార వృథాకు అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం 2013లో  ‘ఆపరేషన్‌ ఎమ్టీ ప్లేట్‌’ ప్రవేశపెట్టింది. దీని ద్వారా బడా వ్యాపారవేత్తలు అధికారులు ఇచ్చే పార్టీలలో ఆహారం వృధా కాకుండా చేయాలన్నది దీని లక్ష్యం. 2015లో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ లెక్కల ప్రకారం 1.8కోట్ల టన్నుల ఆహారం చైనాలో వృథాగా పోతోంది. దీంతో దాదాపు 5 కోట్ల మందికి ఏడాదిపాటు ఆకలి తీర్చవచ్చు. తాజాగా, వుహాన్‌లోని కేటరింగ్‌ అసోసియేషన్‌ సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడుతూ ఆహార వృథాను తగ్గించాలని ప్రతిపాదించారు.

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది గార్డియన్‌ కథనం ప్రకారం చైనా అత్యధికంగా ఆహార ధాన్యాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే చైనా అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు భారత్‌, వియత్నాంలు కరోనావైరస్‌ కారణంగా వరి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. అనధికారిక లెక్కల ప్రకారం చైనా ప్రపంచ దేశాల నుండి దాదాపు 30 శాతం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది.

ప్రస్తుతం ప్రపంచం అధిక సంక్షోభంలో కూరుకు పోవడంతో ఆయా దేశాలు ఆహారధాన్యాలను ఎగుమతులు నిలిపివేశాయి. దీంతో చైనా ఆహార సంక్షోభం దిశగా పయనిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఆరు దశాబ్దాల కిందట జరిగింది. 1959 ఆహార సంక్షోభం సమయంలో అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్‌ దేశప్రజలందరికీ ఓ పిలుపునిచ్చారు. ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడంతో పాటు ఖాళీ సమయాల్లో తినడం ఆపి వేయాలని కోరారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఆహార సంక్షోభం లేనప్పటికీ భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలపై చైనా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad