Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు జపాన్ ప్రధాని సంచలన నిర్ణయం:పదవికి రాజీనామా!

జపాన్ ప్రధాని సంచలన నిర్ణయం:పదవికి రాజీనామా!

abe afp

జపాన్ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా అల్సరేటివ్ కొలిటిన్‌తో అనే వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రధాని పదవి నుండి వైదొలగనున్నారని  పలు అంతర్జాతీయ పత్రికలు వ్యాఖ్యానించాయి. గత కొంతకాలంగా వారి ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అబే టోక్యోలోని చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం మొదట ఆయన జనరల్ చెకప్ కోసం వచ్చారని చెప్పినప్పటికీ తర్వాత అబే డిశ్చార్జ్ కాకపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రధాని రాజీనామా చేస్తున్నారని వార్తలకు బలం చేకూర్చింది. దీనికి సంబంధించిన విషయాన్ని జపాన్ జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కె శుక్రవారం ధ్రువీక‌రించింది.

అబే ప్రధాని పదవి నుండి తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో తారో అసో ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన జపాన్ ఉప ప్రధానిగా ఉన్నారు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జపాన్ చరిత్రలోనే అతి పిన్నవయసులో అధ్యక్ష పదవిని అధిరోహించిన మొదటి వ్యక్తి అబే.  2006 జులై 14వ తేదీన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆ పదవిని అధిరోహించారు.

జపాన్ లో 2012లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ భారీ విజయాన్ని సాధించడంతో ఆయన మరోసారి అధ్యక్ష పగ్గాలు ను అందుకున్నారు.  అయితే ఆయన రాజీనామా వెనుక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కరోనా నియంత్రణ మరియు అవినీతి ఆరోపణలు కారణంగా వారు పదవి నుండి తప్పుకోన్నారని జపాన్ మీడియా కొన్ని కథనాలు ప్రచురితం చేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad