Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు దగ్గినా, తుమ్మినా ఇక అంతే సంగతులు!

దగ్గినా, తుమ్మినా ఇక అంతే సంగతులు!

Amid of Corona Virus Pupils Sent To Home

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం దశలవారీగా ఈ లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ వస్తున్నాయి. కాగా లాక్‌డౌన్ ఎత్తేసిన దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాటు, మళ్లీ అక్కడ కరోనా వ్యాప్తి జరగకుండా ఆయా దేశాల ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఇంగ్లండ్‌లోని సౌత్ ససెక్స్ అనే ప్రాంతంలో ఇటీవల విద్యాలయాలు తెరుచుకున్నాయి. కాగా విద్యార్ధి విద్యార్థికి మధ్య దూరం పాటిస్తూ తరగతి గదులను ఏర్పాటు చేశారు. అయితే ఈ తరగతి గదుల్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, లేక అలా నటించినా, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్క్ అలెగ్జాండ్ర అకాడ‌మీ సిద్ధమయ్యింది. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. తమ అకాడమీలో ఇలా ఎవరైన కనిపించారంటే వారిని వెంటనే ఇంటికి పంపించేస్తామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని సదరు అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

మొత్తానికి కరోనా కారణంగా ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న ఆ అకాడమీ నిర్వాహకులను అక్కడి ప్రజలు మెచ్చుకుంటున్నారు. నిబంధనలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ అది పిల్లలు అలవాటు చేసుకుంటే వారికే మంచిది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తపరుస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad