Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు మోదీకి జై కొడుతున్న చైనీయులు

మోదీకి జై కొడుతున్న చైనీయులు

000 Modi1 ED 2 1

భారతీయులకు చైనా పేరు చెబితే చాలు రక్తం మరుగుతుంది. ఆకారణంగా 20 మంది భారత సైనికులు ప్రాణాలు బలి తీసుకున్న చైనా ప్రభుత్వం అంటే భారతీయులకు ఎక్కడ లేని కోపం వస్తుంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలను భారతీయులు ఎప్పటికీ మరిచిపోరు. అయితే చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. తాజాగా చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ సర్వేను జరిపింది. ఈ సర్వేలో దాదాపు 50 శాతం మంది చైనీయులు మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా మరో 50 శాతం మంది చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు.

భారత్ లో చైనీయుల మీద వ్యతిరేక పెరుగుతుందని 70 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, 30 శాతం మంది మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో బలపడతాయని అన్నారు. మరో 9 శాతం మంది దీర్ఘకాలికంగా సత్సంబంధాలు బలపడే అవకాశం ఉన్నట్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ద్వారా చైనీయులు.. భారత్ కు వ్యతిరేకం కాదని ప్రపంచానికి తెలియజేయాలని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మెజారిటీ దేశాలు అనుకుంటున్నాయి. గల్వాన్ ఘటన తర్వాత భారత్ కొరడా ఝుళిపించింది. భారత్ లో ఉన్న పలు చైనా సంస్థలపై అధికారికంగా నిషేధం విధించింది. ప్రముఖ షార్ట్ వీడియో సోషల్ మీడియా దిగ్గజం టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతోపాటు మరో 59 అప్లికేషన్లు కూడా బ్యాన్  చేసి చైనాను కోలుకోలేని దెబ్బ తీసింది.

ఇప్పటికే చైనా టెక్నాలజీ దిగ్గజం హువావే పై నిషేధం విధించాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దశలవారీగా నిషేధం విధిస్తూ వస్తున్న భారత్ భవిష్యత్తులో ఈ సంస్థను భారత్ నుండి వెలి వేయాలని అనుకుంటుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో హువావే పై పూర్తిగా నిషేధం విధించాయి. దీంతో చైనా ఆ దేశాల్లో మార్కెట్ ను  కోల్పోయింది. ఈ పరిస్థితిల్లో భారత్‌లో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad