పుల్వామ ఉగ్ర ఘటనపై పాకిస్తాన్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్” తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పదం అయ్యాయి. ఉగ్ర దాడి గురించి వివరణ ఇవ్వాల్సింది పోయి భారత్ కె వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు ఇమ్రాన్. పాకిస్తాన్ పై భారత్ దాడికి దిగితే దీటుగా సమాధానం చెబుతాం అని ఆ దేశ ప్రదాని అయిన “ఇమ్రాన్ ఖాన్” అధికారిక ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
నిజానికి పుల్వామ ఉగ్ర దాడి జరిగి 5రోజు అయిపోయింది. అయిన మాకేం తెలియదు అని ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న పాకిస్తాన్ 5రోజుల తరువాత స్పందించింది. అలా అని తప్పు మాదే మరోసారి జరగకుండా చూసుకుంటాం అనాల్సింది పోయి.. కాశ్మీర్ లో ఏ ఉగ్రదాడి జరిగిన భారత్ కావాలనే మాపై ఆరోపణలు చేస్తుంది. పుల్వామా దాడికి మాకు ఎలాంటి సంబందం లేదు. నిజానికి మేము కూడా ఉగ్రవాద బాదితులమే అంటూ సంజాయిషీ ఇచ్చాడు పాకిస్తాన్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్”.
పైగా పుల్వామ దాడికి సంబందించి సరైన ఆధారాలు చూపిస్తే భారత్ కి సహకరిస్తాం..తప్పు చేసినవాళ్లు ఎవరైనా ఉపేక్షించేది లేదు. అంతే కానీ ఎవరో చేసిన ఉగ్ర దాడిని పాకిస్థానే చేసింది అని మాపై దాడులు చేస్తే మేము కాలిగా కూర్చోమ్.. భారత్ దాడికి దిగితే మేము దీటుగా సమాధానం చెబుతాం అని పాకిస్తాన్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్” అదికారిక ప్రకటన చేశాడు. “ఇమ్రాన్” మాటలు చూస్తుంటే ఈ 5రోజులు ఏదో దేశంతో మతనాలు జరిపిన పాకిస్తాన్, వారి సహాయం కోరి ఉంటుందని.. అందుకే “ఇమ్రాన్” అంతా దైర్యంగా మీడియా ముందు వచ్చాడని స్పష్టంగా అర్దం అవుతుంది.
ఇదిలాఉంటే పాక్ ప్రదాని “ఇమ్రాన్ ఖాన్” వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. “ఇమ్రాన్ ఖాన్” ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిజానికి ఇమ్రాన్ మాటలకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. పుల్వామ దాడిని ఖండిచకూడానే మాకు సంబందం లేదు అని “ప్రెస్ మీట్” పెట్టడంతోనే వాళ్ళు ఎంతకూ తెగించారో అర్దం చేసుకోవచ్చు. పుల్వామా దాడిలో పాక్ పాత్రపై మా వద్ద సరైన ఆధారాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా పాక్ కు చాలా ఆధారాలు ఇచ్చాం.. కానీ వాళ్ళల్లో మార్పు రావడం లేదు. ఉగ్రవాదానికి కేంద్రంగా పనిచేస్తున్న పాక్ కి ఈసారి ఎలాగైనా బుద్ది చెబుతాం అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.