Home రాజకీయాలు చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన 17 ఏళ్ల కుర్రాడు

Dodo Drop

భారత్ తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంటా,బయట తగలుతున్న షాక్ లుతో కోలుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఏడాది ప్రారంభం జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన కేంద్ర సర్కారు తరువాత మరో 47 యాప్స్‌ను బ్యాన్‌ చేసింది. ఇక‌, టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ ఏకంగా 29,800 చైనా యాప్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పటికే టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడ. భారత్ లో చైనా యాప్స్ నిషేధంతో దాదాపు 90 వేల కోట్ల నష్టం ఏర్పడింది.

ఈయాప్స్ లో ప్రముఖ ఫైల్ షేరింగ్ యాప్ “షేర్ ఇట్“ కూడా ఉంది. సరైన సమయం రావడంతో ఇండియన్ యాప్ డెవలపర్లు చెలరేగి పోతున్నారు. చైనా యాప్ లకు ధీటుగా సొంత యాప్ లను తయారు చేస్తున్నారు. తాజాగా షేర్ ఇట్ కు ప్రత్యామ్నాయం డోడో డ్రాప్ అనే షేరింగ్ అప్లికేషన్ ప్లే స్టోర్ లో ట్రెండ్ లో నిలిచింది. ఈ అప్లికేషన్ ను జమ్మూకాశ్మీర్‌ కు చెందిన అష్ఫాక్ మెహమూద్ చౌదరి అనే 17 ఏళ్ల బాలుడు అభివృద్ధి చేశాడు.ఇది ఇంటర్నెట్ లేకుండా రెండు డివైసులు మధ్య ఆడియోలు, వీడియోలు, ఫొటోలను సులభంగా షేర్ చేస్తుంది.

ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడానికి మెహమూద్ కు కేవలం నాలుగు వారాలు మాత్రమే పట్టింది. డోడో డ్రాప్ యప్ 480 Mbps వేగంతో ఫైల్స్ ను షేర్ చేయడంతో పాటు ఆ డాటాను ఎన్క్రిప్ట్ కూడా చేస్తుంది. ఈ అప్లికేషన్ వినియోగదారుల నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని సేకరించదని మెహమూద్ తెలిపారు. ప్రస్తుతం చైనా యాప్స్ కు పోటీగా ఎన్నో రకాల ఇండియన్ యాప్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ చైనా యాప్స్ బ్యాన్ ఇండియన్ డెవలపర్స్ కు మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad