Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు భవిష్యత్తులో భారత్ బలమెంత..

భవిష్యత్తులో భారత్ బలమెంత..

maxresdefault 5

సాధారణంగా ఏ దేశంలో అయితే బలమైన ఆర్మీ, నూతన సాంకేతిక విజ్ఞానం ఉంటుందో ఆ దేశం అగ్రరాజ్యంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా ఆయుధ సంపత్తి మరియు టెక్నాలజీలో ముందు వరుసలో ఉంది. 2020 నాటికి అమెరికా  జీడీపీ 19 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఆ తర్వాత స్థానంలో చైనా కొనసాగుతూ వస్తుంది. ఇవన్నీ ప్రస్తుత లెక్కలు. భవిష్యత్తులో ప్రపంచ దేశాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని అంచనాతో ఓ నివేదిక విడుదలైంది దాని ప్రకారం…2030నాటికి రష్యా ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారనుంది. 2030నాటికి మెజారిటీ దేశాల సైనిక బలాబలాలు మరింత పెరగనున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషించగా 2030నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 5 సైన్యాల్లో భారత్ కూడా ఒకటిగా నిలవనుంది. మొదటి వరుసలో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఉండగా భారత్ ఐదో స్థానంలో ఉండనుంది. భారత రక్షణ రంగంలో నూతన ఆయుధాల సేకరణ మరియు  సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో భారత్ శక్తి సామర్ధ్యాలు భారీగా పెరగనున్నాయి. పరిస్థితులు ఏవిధంగా మారినప్పటికీ అమెరికా మరో దశాబ్దం పాటు నెంబర్ వన్ స్థానంలో ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుత భారత్ బలం : ప్రపంచంలోనే నాల్గొవ అత్యంత శక్తివంతమైన మిలటరీ భారత్ కు ఉంది. భారత్ లో 1.4 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా, రిజర్వ్ ఫోర్స్ లో 2.8 మిలియన్ల సైనికులుఉన్నారు. వీరందరు పారామిలటరీ విభాగానికి చెందిన వారు. భారత్ వద్ద శక్తివంతమైన మానవ వనరులు ఉన్నాయి. యుద్ధం సమయంలో ఎంత మంది సైనికులునైన భారత్  నిలబెట్టగలదు.దీనికి అదనంగా ఇండియాలో 50% యువకులే ఉండటం  కలిసివచ్చే అంశం.భారతదేశం బలమైన వైమానిక దళాన్ని కూడా కలిగివుంది. ఇందులో  540 యుద్ధవిమానాలు, 804 ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, భారీస్థాయిలో వస్తువుల రవాణా మరియు నిఘా కోసం 720 సూపర్ హెలికాఫ్టర్లు ఉన్నాయి. 

చైనా సైనిక బలం : చైనా ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన మిలటరీను కలిగివుంది. చైనాలో 2.2 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా, రిజర్వ్ ఫోర్స్ లో 5 మిలియన్ల సైనికులు ఉన్నారు. మొత్తం వైమానిక  దళంలో  1,125 యుద్ధ విమానాలు, 1,527 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 281  ఎటాక్ హెలికాఫ్టర్లు ఉన్నాయి. భారత్ తో పోలిస్తే  చైనా వైమానికదళం చాలా శక్తి సామర్ధ్యాలను కలిగి  ఉంది.

రష్యా సైనిక సామర్ధ్యం : ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన మిలిటరీని రష్యా కలిగి ఉంది. రష్యాలో  1 మిలియన్ యాక్టివ్ ఫోర్స్ ఉండగా, రిజర్వ్ ఫోర్స్ లో 2.5 మిలియన్ల సైనికులు ఉన్నారు. మొత్తం వైమానిక  దళంలో 818 యుద్ధ విమానాలు, 1,416  ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ  ట్యాంకులను  కలిగివుంది.రష్యాలో దాదాపు 20 వేల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.

ది గ్రేట్ అమెరికా : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు బలమైన ఆర్మీ అమెరిక సొంతం. అమెరికాలో 1.3 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా, రిజర్వ్ ఫోర్స్ లో 8 లక్షల సైనికులు ఉన్నారు. వైమానిక దళంలో 2,830 యుద్ధ విమానాలు మరియు 2,830 మల్టీ రోల్ విమానాలు, 973 ఎటాక్ హెలికాఫ్టర్లు ఉన్నాయి. అమెరికా వైమానిక సామర్ధ్యం చైనా, రష్యా కంటే రెండు రేట్లు పెద్దది. అమెరికా వద్ద ఉన్న యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉన్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad