Home రాజకీయాలు పాక్ ఆర్మీ అదుపులో భారత్ కమాండర్ “అభినందన్”.. యుద్ధం మొదలైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు :...

పాక్ ఆర్మీ అదుపులో భారత్ కమాండర్ “అభినందన్”.. యుద్ధం మొదలైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు : ఇమ్రాన్‌

నిన్నటి వరకు ఆనందంగా ఉన్న భారతీయుడి గుండె ఇప్పుడు బాదతో బరువెక్కింది. కారణం మన భారత వింగ్ కమాండర్ “అభినందన్” ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉండడమే.. యుద్ద విమానం కూలిపోవడం వల్ల కమాండర్ “అభినందన్” పాక్ ఆర్మీకి యుద్ద ఖైధిగా దొరికాడు. నిజానికి యుద్ద ఖైధిని కొట్టడం, హింసించడం చేయకూడదు. కానీ పాక్ చేసింది.. పైగా ఆ దృశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అది చూసి ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుంది.

పాక్ తీరు చూస్తుంటే యుద్దానికి సిద్దం అనేలా కనిపిస్తుంది. అందుకే యుద్దం చేయాలా ? వద్దా ? అని భారత్ చర్చలు జరుపుతున్న సమయంలో పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ మరో వీడియో రిలీజ్ చేశాడు. అందులో “ఒక్కసారి యుద్ధం మొదలైతే తన చేతుల్లో గానీ, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండదు” అంటూ భారత్ ఊహించని స్టేట్ మెంట్ ఇచ్చాడు ఇమ్రాన్. అలాగే పాక్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఇమ్రాన్.. “పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు భారత్‌ కు విజ్ఞప్తి చేశామని.. అయిన వాళ్ళు స్పందించకుండా మన ప్రాంతంపై దాడి చేయడంతోనే ఇప్పుడు తిరుగుతాడి చేశామని ప్రకటించాడు.

“మా భూభాగంలోకి మీరు వచ్చారు.. అందుకే మీ భూభాగంలోకి మేం వచ్చాం” అని ప్రకటించిన ఇమ్రాన్.. “పుల్వామా దాడి తర్వాత భారత్‌ ఎంత బాధపడిందో మేము అర్థం చేసుకోగలం.. గత పదేళ్లలో నేను ఎన్నో హాస్పటల్స్ కి వెళ్లి బాంబు దాడి కారణంగా గాయపడ్డ వారిని కళ్ళారా చూశాను.. బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు.. పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. ఇరు దేశాల మధ్య ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకూడదనే మేము కోరుకుంటాం. సమస్యకు యుద్ధం అనేది పరిష్కారం కాదు. సావధానంగా కూర్చొని చర్చించుకుందాం” అంటూ తెలివిగా సామదానం ఇచ్చాడు ఇమ్రాన్.. ఈ దాడి విషయం భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad