Home రాజకీయాలు ప్రాబ్ల‌మ్స్ పెట్టుకుంటే.. ఫినీష్ అయిపోతారు :చ‌ంద్ర‌బాబు

ప్రాబ్ల‌మ్స్ పెట్టుకుంటే.. ఫినీష్ అయిపోతారు :చ‌ంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు చేదు అనుభ‌వం ఎదురైంది. కాగా, తెలుగుదేశం ప్ర‌భుత్వం జ‌న్మ‌భూమి – మా ఊరు ఆరో విడ‌త కార్య‌క్ర‌మాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా సీఎం చ‌ద్ర‌బాబు ఇవాళ కాకినాడ ప‌ర్య‌టించారు.

‘జన్మభూమి – మా ఊరు’ కార్యక్రమానికి కాకినాడ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడిని స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృధి పనుల్లో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీ ఆందోళనతో కాన్వాయి దిగిన చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, లేని పోని ప్రాబ్లమ్స్ పెట్టుకుంటే మీరు ఫినీష్ అయిపోతారు అంటూ చంద్ర‌బాబు వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంఘ‌ట‌న కాకినాడ‌లోని జేఎన్టీయూ స‌మీపంలోని జంక్ష‌న్‌లో చోటు చేసుకుంది.

అయితే ప్రధాని మోడీ ఏపీ పర్యటనను అడ్డుకుంటామ‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో, ఆ మేర‌కు టీడీపీ నేతలు స‌మాయ‌త్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన పర్యటన ఎందుకు అడ్డుకుంటారు..? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, దానికి ప్రతికార చర్యగా ఇవాళ చంద్ర‌బాబు కాకినాడ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్నారు. ఆ వెంట‌నే అలెర్ట్ అయిన పోలీసులు ఆందోళ‌న చేస్తున్న బీజేపీ శ్రేణుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad