పశ్చిమ బెంగాల్ బసిర్హాట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ హిందూ స్త్రీ తరహాలో పార్లమెంట్‌కు రావడంపై మతపెద్దలు చేసిన విమర్శలు, ఫత్వా జారీ చేయడం దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో తనపై వచ్చిన విమర్శలకు నుస్రత్ జహాన అదేరీతిన ట్వీటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
కుల, మత, ప్రాంతాలకు అతీతమైన భారతావణికి తాను ప్రతీకనని, జన్మతః ముస్లింనైనా అన్ని మతాలను గౌరవిస్తానని నుస్రత్ జహాన్ చెప్పింది. ఇప్పటికీ నేను ముస్లింనే, నేను ఏం ధరించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు.. విశ్వాసం అనేది అలంకరణకు సంబంధం లేనిది, ఆ అంశం అన్ని మతాలలో ఉన్న అర్ధం, పర్ధం లేని సిద్ధాంతాలకు మించినది అంటూ ఎంపీ నుస్రత్ జహాన్ ట్వీట్ చేసింది.