Home రాజకీయాలు జాతీయ వార్తలు సెప్టెంబర్ లో ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు

సెప్టెంబర్ లో ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు

Untitled design 26 1 1 1280x720 1

బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల ఫైనల్‌ సెమిస్టర్ పరీక్షలకు అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. యూజీసీ మరియు సుప్రీంకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ నెలలో ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్షలను సెప్టెంబర్ 30 లోగా లేకుంటే యూజీసీ అనుమతితో రాష్ట్రాలు తర్వాత అయినా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

మెజారిటీ యూనివర్సిటీలు సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడంతో మరికొన్ని రోజుల్లో పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షలకు దాదాపు 15 రోజుల ముందుగానే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని ద్వారా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందని యూజీసీ అభిప్రాయపడింది. ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు గత ఐదు నెలలుగా వేచి చూస్తున్నారు. తాజా విద్యా మండలి నిర్ణయంతో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. సెప్టెంబర్ 16 నుండి బీటెక్ పరీక్షలు మొదలుకానుండగా మరికొన్ని రోజుల్లో బీఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది. 

ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీల పరీక్ష తేదీలు వచ్చేవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలను అక్టోబర్ లోగా ముగించాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫైనల్ ఇయర్ బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థుల పరీక్షలు కూడా సెప్టెంబర్ లోనే ఉండనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు లేవు. గతంలో ప్రభుత్వం వారిని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad