Home రాజకీయాలు ఏపి వార్తలు సీఎం జగన్ పై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు

image big 165165b9f55f173106 1

తాజాగా విజయవాడలోని ప్రైవేటు కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం పై హీరో రామ్ పోతినేని ట్విటర్ లో స్పందించారు. స్వర్ణ ప్యాలెస్‌లో ఘటనలో  కుట్ర జరుగుతుందని అన్నారు. స్వర్ణ ప్యాలెస్‌ ను కోవిడ్ సెంటర్‌ గా మార్చడానికి ముందే ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటరను నిర్వహించిందని. ఆ సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వారని ప్రశ్నించారు. ఈ కేసును పక్కదారి పట్టించడానికి కరోనా ఫీజులు వైపు ప్రజలను మళ్ళిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కింది స్థాయి కొందరు ఉద్యోగులు లేదా నాయకులు సీఎం జగన్ కు తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారని వారిపై నిఘా ఉంచాలని సోషల్ మీడియా ద్వారా రామ్ విజ్ఞప్తి చేశారు.

దీనితో పాటు వారు ప్రభుత్వ  ప్రతిష్ఠను మరియు సీఎం స్థాయిని  దిగజారటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందని దానిని నాశనం చేసే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని హీరో రామ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అసలు ఆ ముసుగు వీరులు ఎవరన్నది మాత్రం రామ్  తెలపలేదు. స్వర్ణ ప్యాలెస్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌గా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే హీరో రామ్ ట్వీట్ చేయడంతో అగ్నికి ఆహుతి తోడయ్యింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad