Home రాజకీయాలు ఏపి వార్తలు ఏపీ రాజకీయ పార్టీల్లో పెరుగుతున్న అసమ్మతి సెగలు

ఏపీ రాజకీయ పార్టీల్లో పెరుగుతున్న అసమ్మతి సెగలు

election 7660

వైఎస్సార్‌సీపీలో చిచ్చు రేపుతున్న “రఘురాం రాజు” : 

ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతో భారీ విజయం అందుకున్న వైఎస్ఆర్సిపి పార్టీ తమకు ఎదురు లేదు అనుకున్న సమయంలోనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వైఖరి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వ్యక్తిగత కారణాలు లేదా రాజకీయ పరమైన కారణాలు వలన ఆయన ఒక్కసారిగా రెబల్‌స్టార్‌గా మారిపోయారు. రోజుకో రీతిలో ప్రభుత్వంపై నేరుగా సీఎం జగన్‌పై పరోక్షంగా దాడి మొదలుపెట్టారు. గోదావరి జిల్లాల వెటకారాన్ని జోడిస్తూ  సీఎం జగన్‌పై బాణాలు ఎక్కుపెడుతున్నారు.  ఆ విమర్శలు చేస్తున్న టైమింగ్,  మాటల్లో వ్యంగ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సింహాన్ని గిల్లి కలుగులోకి జారిపోతున్న ఎలుకలా రఘురామకృష్ణం రాజు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ చాటున నక్కుతున్నారు. కొన్నిరోజులు ప్రతివిమర్శలు చేసిన వైఎస్సార్‌సీపీ తరువాత ఆయనను అనర్హుడిగా ప్రకటించమని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించి చేతులు దులుపుకుంది. ఇదే అదనుగా ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల జోరు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో వైకాపా పార్టీ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  

జనసేనతో రఫ్ ఆడుతున్న ‘రాపాక’ : 

ఇక జనసేన పార్టీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పార్టీ తరఫున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా జగన్‌ పంచన చేరి పవన్ కళ్యాణ్ ను వెక్కిరిస్తుంటే ఆయనకు పుండుపై కారం చల్లినట్టుగా ఉంటోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఆయన ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ  మీటింగ్‌లకు రారు.  ‘ పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల ఓడిపోయారు… రాష్టరంలో నేనొక్కడినే గెలిచాను. ఇది నా గెలుపే గానీ పార్టీ గెలుపు కాదు’ అని తేల్చేశారు. గట్టిగా ప్రతి విమర్శలు చేద్దామంటే సామాజికవర్గ సమీకరణల పరంగా సున్నితమైన అంశంగా మారింది. ఆయనపై విప్‌ జారీ చేసే అవకాశం కూడా లేదు.  రాపాక వర ప్రసాద్‌ ఏకైక ఎమ్మెల్యే కాబట్టి ఆయనే అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌…ఆయనే విప్‌.  జనసేన శాసనసభా పక్షాన్ని వైఎస్సార్‌సీపీలో విలీనం చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే పవన్‌ కల్యాణ్‌ మౌనంగా ఉండిపోవడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. అదే అవకాశంగా రాపాక వర ప్రసాద్‌ ఏకంగా జనసేను గాలిలో అగ్ని రాజేసి ఉన్నారు. పార్టీలో ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఉండటంతో అధ్యక్షుడు గాని కార్యకర్తల గాని ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబుతో ఆ ముగ్గురూ చెడుగుడు : 

ప్రధాన ప్రతిపక్షం  తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది . 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ (కృష్ణా జిల్లా), మద్దాల గిరి (గుంటూరు జిల్లా),  కరణం బలరాం (ప్రకాశం జిల్లా) చంద్రబాబుకు ఝలక్‌ ఇస్తూ జగన్‌ పంచన చేరిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికిపాటి  మోహనరావులను చంద్రబాబు నేరుగా ఒక్క మాట కూడా అనలేదు. ఆయనే వారిని వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపారన్న వాదనకు టీడీపీ మౌనం, ఆ నలుగురు బీజేపీలో ఉంటూ టీడీపీ వాదనను లేవనెత్తుతున్న తీరే నిదర్శనం. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతో జట్టు కట్టిన ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలను చంద్రబాబు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇదే అదనుగా ఆ ముగ్గురు చంద్రబాబుపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ప్రధానంగా వల్లభనేని వంశీ అయితే చంద్రబాబు తనయుడు  లోకేశ్‌ సమర్థతను వెక్కిరిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనిపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో సదరు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్టీలోను అసమ్మతి సెగలు తారస్థాయిలో ఉన్నాయి.   

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad