Home రాజకీయాలు ఏపి వార్తలు ఎక్కువ జీతాలు మాకొద్దు.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

ఎక్కువ జీతాలు మాకొద్దు.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

Government Employees Federation Rejected High Court Decision

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారిని నివారించే క్రమంలో భారతదేశ వ్యాప్తంగా రెండు నెలలకు పైగా పూర్తి లాక్‌డౌన్‌ను విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎలాంటి ఆదాయం లేకుండా పోయింది. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పలు రాష్ట్రాలు సగం కోతతో జీతాలను చెల్లించింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యాయి.

అటు ఏపీ ప్రభుత్వం కూడా మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం కోత విధిస్తూ జీతాలను అందించింది. అయితే ఈ విషయంపై న్యాయశాఖ చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిణి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైన పద్ధతి కాదని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు కరోనా సంక్షోభ సమయంలో కోత విధించిన జీతాలను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వా్న్ని ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సామఖ్య చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి ఈ తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

యావత్ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు తమకు 12 శాతం వడ్డీతో జీతాలు కావాలని తాము కోరలేదని ఆయన అన్నారు. తాము పనిచేసినా, చేయకపోయినా ప్రభుత్వం 50 శాతం జీతాలను అందించిందని, అలాంటి ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నప్పుడు తమకు కూడా బాధ్యత ఉంటుందని వారు అంటున్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ప్రజలు తమను చిన్నచూపు చూస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో చర్చించాకే ప్రభుత్వం తమ వేతనాల్లో కోతను విధించిందని, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఈ తీర్పును పున:సమీక్షించాలని హైకోర్టును ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరనున్నట్లు ఆయన అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad