Home రాజకీయాలు జాతీయ వార్తలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారు!

Former President Pranab Mukherjee Is Alive

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే గత రాత్రి నుండి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాతో పాటు ఎలెక్ట్రానిక్ మీడియాలో చక్కర్లు కొడుతూ కనిపించింది. కరోనా పాజిటివ్ కారణంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం బాగా క్షీణించి, ఆయన బుధవారం రాత్రి మరణించారనే వార్త ఒక్కసారిగా రాజీకీయ వర్గా్ల్లో ఉలిక్కిపడేలా చేసింది.

కాగా ఈ వార్తలపై ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మండిపడ్డాడు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన తండ్రి ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. తన తండ్రి ఇంకా బతికే ఉన్నారని, ఆయన మృతిపై వస్తున్న వార్తలు తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దేశంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఛానళ్లు ఇలాంటి ఫేక్ న్యూస్‌ను మరింత బలపర్చడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నాడు. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ప్రముఖ పాత్రికేయులు సైతం ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం బాధాకరమని ఆయన అన్నాడు.

భారత మీడియా కేవలం ఫేక్ న్యూస్‌ను వెల్లడించే ఫ్యాక్టరీగా మారిందని, దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దంటూ కోరాడు. ప్రణబ్ ముఖర్జీ బతికే ఉన్నారనే విషయం తెలుసుకుని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad