వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ స్థాపన నుంచి నేటి వరకు విలువలు కలిగిన రాజకీయాలను మాత్రమే చేశారని వైఎస్ షర్మిల అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీని వీడితే తనపై కేసులు పెడతారని వైఎస్ జగన్‌కు ముందే తెలుసని, కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. జగన్ అవినీతే గనుక చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడి ఉండేవారే కాదని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్ జగన్ గడిచిన తొమ్మిదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సగర్వంగా, తలెత్తుకునేలా వైఎస్ జగన్ రాజకీయాలు చేశారని షర్మిల అన్నారు. చంద్రబాబులా అధికారం కోసం అమలు చేయలేని హామీలు ఇవ్వలేదని, ఒక జెండా పట్టుకుని గెలిచిన వారిని పార్టీలోకి చేర్చుకుని రాజకీయ వ్యభిచారం చేయలేదు..
వైఎస్ జగన్ పదవుల కంటే విశ్వసనీయతే ముఖ్యమనుకున్నారు… ఈ తొమ్మిదేళ్లు ప్రజలకు వచ్చిన ప్రతీ కష్టంలో ప్రజల పక్షాన నిలిచి వారి కోసమే పోరాటం చేశారు.. పాదయాత్ర చేసి కోట్ల మంది ప్రజలను కలుసుకున్నారు… వారి కష్టాలను తెలుసుకున్నారు… వాళ్ల కష్టాలను అర్ధం చేసుకున్నారు… నాన్నలా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతీ వర్గానికి మేలు చేయాలని ఆశ పడుతున్నాడు. అటువంటి జగన్‌కు మనం ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు.