Home రాజకీయాలు ఏపి వార్తలు ఆంధ్రా వూహాన్‌గా మారుతున్న తూగో జిల్లా

ఆంధ్రా వూహాన్‌గా మారుతున్న తూగో జిల్లా

east godavari thumb

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో కరోనా వైరస్ కనుగొనబడిన వూహాన్ నగరంలో కరోనా ఎలాంటి మరణమృదంగం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరం ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటోంది. కాగా ఇప్పుడు వూహాన్ నగరాన్ని తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లా తయారవుతుండటంతో ఏపీ రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తూ.గో జిల్లాలో కరోనా కేసులు మరీ ఎక్కువగా వస్తుండటంతో ఆ జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో అక్కడి అధికారులు చేతులెత్తేశారు. రోజూ వేల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా, పాజిటివ్ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇక ఈ నగరాల్లో ఇంటికొక కరోనా కేసు నమోదవుతుందని అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది.

పాజిటివ్ అని తేలి సరై వైద్యం తీసుకునేలోనే చాలా మంది ప్రాణాలను వదులుతున్నారు. దీంతో ఈ జిల్లా మరో వూహాన్‌గా మారుతుందా అనే సందేహం అక్కడి యంత్రాంగంలో నెలకొంది. ఆరోగ్య శాఖ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, కరోనా రోగులు, ప్రజలు సరైన అవగాహన లేకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. కరోనా పాజిటివ్ అని తేలినా విచ్చలవిడిగా రోడ్లపై జనాలు తిరుగుతుండటంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం కరోనా రోగులను గుర్తించి వారిని కట్టడి చేసి సరైన చికిత్స అందిస్తే మిగతావారికి ఈ వైరస్ సోకకుండా ఉంటుందని తూగో జిల్లా వాసులు కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad