Home రాజకీయాలు ఏపి వార్తలు ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Eamcet Entrance Date Fixed In AP

కరోనా వైరస్ కారణంగా మార్చి నెల నుండి దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఇక కొన్ని రాష్ట్రాలు విద్యార్ధులకు పరీక్షలు నిర్వాహించాలని చూసినా అది సాధ్యం కాకపోవడంతో వారిని తదుపరి క్లాసులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను మాత్రం ఎప్పటికైనా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి.

తాజాగా ఎంసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ ఈ మేరకు ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 14న ఈ-సెట్, సెప్టెంబర్ 10-11న ఐ-సెట్, సెప్టెంబర్ 28-29-30న ఏపీజీ ఈ-సెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్ (ఉదయం), లా సెట్ (మధ్యాహ్నం), అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.

దీంతో గతకొంత కాలంగా చదువులకు దూరంగా ఉన్న విద్యార్ధులు తిరిగి పుస్తకాలను పట్టే పనిలో పడ్డారు. ఇక ఈసారి పరీక్షల నిర్వహణలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏపీ విద్యార్ధుల విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉండేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కరోనా కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణ చేపడతామని అధికారులు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad