Home రాజకీయాలు జాతీయ వార్తలు రామ మందిర నిర్మాణం ఇలా ఉండ‌బోతుంది….విడుద‌లైన డిజైన్లు

రామ మందిర నిర్మాణం ఇలా ఉండ‌బోతుంది….విడుద‌లైన డిజైన్లు

PicsArt 08 08 11.34.59

ద‌శాబ్దాల పాటుగా హిందువులు కన్న కల ఇప్పుడు నిజం అవ్వబోతోంది. ఎన్నో సంవత్సరాలు రామమందిరం కోసం పడిన కృషి …..త్వ‌ర‌లోనే ఫలించ‌బోతుంది. అందులో భాగంగా అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఇప్ప‌టికే భూమి పూజ కూడా జ‌రిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వ‌చ్చి భూమి పూజ చేశారు. ఇక రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను….. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ లో విడుదల చేసింది. రామ మందిర నిర్మాణం ఎలా జ‌ర‌గ‌బోతుంది అంటే…ఆల‌యం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఉత్తర భారతదేశ నాగర శైలి లో దేవాల‌య నిర్మాణం జరగనుంది. ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం అయ్యేలా…. ఆలయ సముదాయం ఉండబోతోంది. ముందు అనుకున్న నమూనా కంటే….. ఆలయం ఎత్తు 20 అడుగుల పెంచారు అని శిల్పులు ఇప్ప‌టికే తెలిపారు. ఇక భూమి పూజ కోసం దేశం న‌లుమూల‌ల్లోనే దాదాపు 2000 ప్రాంతాల నుండి మట్టి ని తీసుకొచ్చారు. నూటొక్క నదుల నుండి నీటిని తీసుకొచ్చారు.

రామమందిరాన్ని 3 అంతస్తులుగా 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తారట. గతంలో ప్రణాళిక వేసిన దానికంటే రెట్టింపు ఎత్తులో …..రామమందిర నిర్మాణం జరగనుందట. శ్రీ రామ్ జన్మభూమి మందిరం భారతీయ సంస్కృతిక నిర్మాణానికి ఉదాహరణగా నిల‌వ‌నుంది. ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పట్టేలా రామ మందిరాన్ని క‌ట్ట‌బోతున్నారని …..శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ట్విట్టర్ లో వెల్ల‌డించారు.

ప్రముఖ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రకాంత్ సోమ్‌పుర రామమందిర నమూనా నిర్మాణాన్ని డిజైన్ చేశారు. సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ వంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను…. చంద్రకాంత్ కుటుంబమే రూపొందించింది. ప్రస్తుతం చంద్రకాంత్ దేశంలో నిర్మించబోతున్న మ‌రో 8 ఆలయాలకు డిజైన్లను రూపొందిస్తున్నారు. రామమందిర నిర్మాణ నమూనాల కోసం…. 30 ఏళ్ల కిందటే తనను సంప్రదించినట్లు చంద్రకాంత్ తెలిపారు. ఈయ‌న త‌యారు చేసిన న‌మూనా ప్ర‌కారం …… ఆలయంలో మొత్తం ఐదు గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి ఆక్టాగాన్ అంటే అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. రామమందిర నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వాడరు. రాజస్థాన్, ఆగ్రా నుండి తెప్పించిన రాతి పలకలతో…. ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరం లో నిల్చున్నా కూడా….. శ్రీరాముని విగ్రహం కనిపించేలా నిర్మిస్తున్నారు. అంతేకాదు భూకంప తీవ్ర‌త‌ను త‌ట్టుకునేలా గుడిని రూపొందిస్తున్నారు. రిక్ట‌ర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపం వచ్చినా కూడా ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నారు. అంతేకాదు…. వెయ్యేళ్ళు అయినా కూడా ఆలయ పటిష్టత దెబ్బ‌తిన కుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఆల‌య నిర్మాణం ఎప్ప‌టికీ…. బలంగా ఉండేలా ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇక మ‌హాయ‌జ్ఞంలో పాలుపంచుకునేందుకు కోట్లాది మంది భ‌క్తులు పోటీప‌డుతున్నారు. త‌మ వంతు సాయంగా చందాలు వేస్తున్నారు. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు చందాలు వ‌చ్చాయి. మున్మందు ఇంకా రాబోతున్నాయి. అన్ని అనుకున్న‌ట్టే జ‌రిగితే రెండేళ్ల లోపే ఆయ‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు శ్రీరామ‌క్షేత్ర ట‌స్ట్రీ నిర్వాహ‌కులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad