Home రాజకీయాలు జాతీయ వార్తలు సుప్రీంకోర్టు సంచలన తీర్పు : ఆనందంలో మహిళలు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు : ఆనందంలో మహిళలు

PicsArt 08 11 07.28.13

మహిళల ఆస్తి హక్కుకు సంభందించిన విషయంలో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. పురుషులతోపాటు స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించడంతోపాటు, తండ్రి జీవించి ఉన్న లేనప్పటికీ తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసును విచారణ సంధర్బంలో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. పార్లమెంట్ 2005లో హిందూ వారసత్వ చట్టం-1956లో చేసిన సవరణలు ఆధారంగా ఈ తీర్పు వెల్లడిస్తున్నట్టు ప్రకటించింది. హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం తండ్రి ఆస్తి కేవలం కొడుకు మాత్రమే దక్కుతుంది. ఈ ఆస్తిలో కుమార్తెకు ఎటువంటి హక్కు వుండదు. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. అయితే చట్టం సవరించిన తరువాత జన్మించిన ఆడపిల్లకు మాత్రమే 2005 హిందూ వారసత్వ చట్టం వర్తిస్తుందని అనేకమంది కోర్టుకు వెళ్లారు. ఇందులో ముఖ్యమైనది ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేస.

ఈ కేసులో బాధితురాలి తండ్రి 1999 డిసెంబర్ 11వ తేదీన మరణించారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కును 2005 సెప్టెంబర్ 9వ తేదీన సవరణలు చేశారు. సవరణ చేసిన తేదీని ప్రాతిపదికగా తీసుకుంటే..ప్రకాశ్ వర్సెస్ ఫులావతి కేసులో బాధితురాలికి ఆస్తిలో సమాన హక్కు దక్కదనేది దాని సారంశం. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం కుటుంబంలో ఆడపిల్ల ఉంటే చాలు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనితో తండ్రి ఆస్తి పై పురుషులు వలె ఆడపిల్లలకు కూడా పూర్తి అధికారం ఉంటుందని స్పష్టంగా తెలిసిపోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad