
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నిత్యం తన రూపాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు సవాళ్ళను విసురుతుంది. తాజాగా ఈ మహమ్మారికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా వైరస్‌పై ఉండే స్పైక్ ప్రొటీన్ ద్వారానే మానవులకు కరోనా సోకుతుందనే విషయం తెలిసిందే. అయితే శరీరం విడుదల చేసే ప్రతి రక్షక కణాల నుండి తప్పించుకోవడానికి కరోనా తన స్పైక్ ప్రొటీన్ పైన చక్కెర వంటి నిర్మాణాలతో కూడిన ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్, యూరోపియన్ మాలిక్యూలర్ బయాలజీ ల్యాబొరేటరీ, ది పాల్ హెర్లిచ్ ఇన్స్టిట్యూట్, గోథే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. ప్రతి దేహాలు వైరస్ పై దాడి చేసే సమయంలో ఇవి అడ్డుగోడలుగా నిలబడి రక్షణ కనిపిస్తున్నాయని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మార్టిన్ బెక్ తెలిపారు.
వైరస్ నిత్యం తన జన్యు నిజరూపాన్ని మార్చుకోవడంతో టీకాలు దానిపై ప్రభావం చూపిస్తాయి లేదన్నది పరిశోధనలకు ప్రశ్నార్ధకంగా తయారయ్యింది. దేశంలో కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. కోవిడ్-19 నుంచి కోలుకుని శుక్రవారం 62,282 మంది రోగులు డిశ్చార్జి కావడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య కూడా 1.89 శాతానికి దిగివచ్చింది. కోవిడ్-19 నుంచి కోలుకుని ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకువచ్చే వారి సంఖ్య పెరగడంతో మొత్తం రికవరీల సంఖ్య 21,58,946కు ఎగబాకింది.