
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది చనిపోతున్నారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. దీనికి వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో జాగ్రత్త చర్యలే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. అందుకే శానిటైజర్స్ వాడకం, ముఖానికి మాస్కులు, సామాజికదూరం పాటించడం లాంటివి చేస్తున్నారు. అలా చేస్తే కొంత వరకు బయట పడినట్టేనని అంటున్నారు. మంది ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వస్తే ఎక్కడ తమ ప్రాణాలు పోతాయోనని భయపడిపోతున్నారు. ఇక తమ ఇళ్ల దగ్గర్లోని ఎవరికైనా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యందని తెలిస్తే…..అలా తెలుసుకున్నవాళ్లు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కొంతమందైతే ఏకంగా ఆ ప్రాంతాల నుంచి వేరే చోటుకు మకాం మార్చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవి ఏంటి అంటే…కొవిడ్ నిర్దారణ అయ్యినంత మాత్రాన.. ఆవ్యక్తి కుటుంబంలోని అందరికీ సోకదు. పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్ళ కుటుంబాలలో…… దాదాపు 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే కరోనా సోకుతుంది. మిగతావారికి ఈ వైరస్ ప్రబలట్లేదని నిర్ధారణ అయింది. దీనికి కారణం ఏంటనే దాని పై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటివరకు పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం…. ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కుటుంబ సభ్యులకు ఈ కరోనా సోకట్లేదు. ఒకవేళ ప్రబలిన అది వారి ఇమ్యూనిటీ లెవెల్స్ ధాటికి నిలువలేక….. మెడికల్ అసిస్టెన్స్ తో పనిలేకుండా నయమవుతుంది. లేదా తక్కువ హానికరం అయిన కరోనా వైరస్ ప్రబలి ఉంటుంది అని అంచనాలకు వచ్చినట్లు తేల్చారు.
ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు కొంత ప్రజలకు ఊరటనిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఇంట్లో కరోనా వస్తే ఆ ఇంట్లో వాళ్లందరికీ దాదాపు వచ్చేసినట్టే అనే వాదనలు జనాల్లో బలంగా ఉన్నాయి. కానీ అది నిజం కాదని తాజా పరిశోధనా ఫలితాలతో నిజమని తేలిపోయింది. మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ఆధారంగా కొవిడ్ ప్రభావం ఆధారపడి ఉంటుంది…అది ఎంత మనశరీరంలో ఉంటే అంత సేఫ్ గా ఉంటామనేది అర్ధమౌతుంది. అందుకే దాన్ని పెంచుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైద్యులు చెప్పిన ఆహార పదార్ధాలతో పాటు కొన్ని ప్రకృతి సిద్ధమైన కోవిడ్ వ్యతిరేక వనరులను వాడమని హితవు పలుకుతున్నారు.