Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు కరోనాకు చెక్ : రష్యా వ్యాక్సిన్‌ రెడీ !

కరోనాకు చెక్ : రష్యా వ్యాక్సిన్‌ రెడీ !

Corona vaccine

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాకు మరికొద్ది గంటల్లో చరమగీతం పాడేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన విధంగానే రేపు ఉదయం 11 గంటలకు కోవిడ్ వ్యాక్సిన్ విడుదలకానుంది. ఈ వ్యాక్సిన్ పై ప్రపంచం దేశాలు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ రష్యా శాస్త్రవేత్తలు మాత్రం ధీమాగా ఉన్నారు.ఇప్పటికే అన్ని ప్రయోగ దశలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ రేపు ఉదయం అంటే ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఈ వ్యాక్సిన్ ను అడినోవైరస్‌ల నుండి తయారు చేయగా, దీనికి “గమ్‌ కోవిడ్‌ వ్యాక్‌ లయో” అనే నామకరణం చేశారు. ప్రస్తుతం వ్యాక్‌ లయోను దేశంలో ఉన్న అందరికీ సరఫరా అయ్యేలా రష్యా సిద్దం చేస్తునట్టు తెలుస్తుంది. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రష్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తయారుచేసిన ఈ టీకా రెండో డోసులుగా ఉండనుంది.

మొదటి టీకాలు వేసిన 21 రోజుల తర్వాత రెండో టీకాను వేయనున్నారు. రెండో డోస్‌తో వ్యాక్సిన్ రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని సమాచారం. అమెరికా ఆరోపిస్తున్నటు ఈ వ్యాక్సిన్ ను ఎవరి నుండి కాపీ చేయలేదని, జలుబును కలిగించే అడినోవైరస్‌ల నుండి తయారు చేశారని స్పుత్నిక్‌ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ టీకాకు సంబంధించిన నమోదు కార్యక్రమం జరుగుతుండగా వచ్చే నెల నుండి వాణిజ్య ఉత్పత్తి జరగనుంది. ముందుగా ఈ వ్యాక్సిన్ వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇస్తుండగా నవంబర్ నుండి పౌరులందరికీ అందిస్తామని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. సురక్షితమైన, సమర్థమైన టీకా అభివృద్ధికి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ టీకా విషయం రష్యా చాలా నమ్మకంగా ఉంది. ఈ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad