Home రాజకీయాలు కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల : అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా - రాహుల్‌

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల : అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా – రాహుల్‌

2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు రాహుల్ గాంధీ. సరికొత్త పద్దతిలో కాంగ్రెస్ పార్టీ విజన్‌ ను ఆవిష్కరించామని చెప్పారు. ఈ మేనిఫెస్టోను గదిలో కూర్చుని రూపొందించలేదని.. ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలిస్తే..

* కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా

* మరీ ముఖ్యంగా అధికారంలోకి రాగానే రఫేల్‌ ఒప్పందం మీద విచారణ

* బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై వెంటనే సమగ్ర విచారణ

* న్యాయ్‌ పథకం ద్వారా ఏడాదికి రూ.72 వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.

* రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్‌ కేసులుగా పరిగణించబోమ్.

* ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. అలాగే పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి 3 ఏళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న 100 పని దినాలను 150కి పెంచుతాం.

* జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తాం.

* అత్యంత ముఖ్యమైన మరో హామీ ఏంటంటే.. “విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం..” అంటూ పేదలను దృష్టిలో పెట్టుకొని తమ మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad