Home రాజకీయాలు ఏపి వార్తలు సీఎం జగన్ మరో ఘనత

సీఎం జగన్ మరో ఘనత

cm jagan thumb

2019లో 153 స్థానలుతో భారీ విజయాన్ని అందుకున్న వైయస్సార్సిపి పార్టీ ఆ తర్వాత కూడా ప్రభంజనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇసుక రీచ్ లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సంక్షేమ పథకాల అములులో విభిన్నమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ట్రెండ్ సెట్టర్ గా మారింది. తాజాగా సీఎం జగన్ మరో ఘనత సాధించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. గత నెలలో ప్రముఖ పత్రిక ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ జరిపిన ఈ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఉండగా, రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు.

ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇండియా టుడే 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే తెలిపినట్లు ప్రకటించింది. ఈ సర్వేను జులై 15 నుంచి 27 మధ్య జరపగా అభిప్రాయ సేకరణ కోసం 12,021 మందిని టెలిఫోన్‌ ఇంటర్వ్యూ చేశారని తెలిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు కార్యకర్తలు గుడికట్టు ఉన్నారని తెలుస్తోంది.ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వచ్చిన జగన్ తమకు దేవుడని, అందుకే ఆయనకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నేతలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కూడా పాల్గొన్నట్లుగా సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad