Home రాజకీయాలు కోర్టును తప్పు దోవ పట్టించారు : సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం - మోహన్ బాబు

కోర్టును తప్పు దోవ పట్టించారు : సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం – మోహన్ బాబు

ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెషల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్షను ఖరారు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాకు వివరణ ఇచ్చిన ఆయన.. “2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశాం… మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగానూ ఆయనకు రూ.40లక్షల చెక్ ఇచ్చాం.

“సలీమ్” అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. వైవిఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను వద్దనుకున్నాం… సినిమా చేయడం లేదని వైవిఎస్ చౌదరి చెప్పాం… అలాగే చెక్ ను బ్యాంకులో వేయవద్దని కూడా చెప్పాం… అయినా కూడా కావాలనే చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి. కోర్టును తప్పు దోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేం సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం… కొన్ని చానెల్స్ లో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దు” అంటూ ఆయన అభిమానులకు YCP కార్యకర్తలకు పిలుపునిచ్చారు మోహన్ బాబు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad