జగన్ పై విషం కక్కుతున్న చంద్రబాబు, రఘురామ..బట్టబయలైన ఆశ్చర్యకరమైన నిజాలు

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక అలాంటి వ్యవహారమే మళ్లి నడిపాడు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వేయని ఎత్తులే లేవనే చెప్పాలి. ఈ సారి ఏకంగా ఎంపీ రఘురామ రాజును పావుగా వాడుకున్నాడు మాజీ సీఎం.

AP CM Jagan min 2జగన్ పై కొన్ని అసత్య ఆరోపణలు క్రేయేట్ చేస్తూ రఘురామ రాజు చేత విషం కక్కే పనులకు శ్రీకారం చుట్టాడు. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, రెండు ప్రముఖ తెలుగు టీవీ చాన‌ళ్ల‌పై సీఐడీ కేసులు న‌మోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ర‌ఘురామ అరెస్ట్ అయ్యి బెయిల్‌పై కుడా విడుద‌ల‌య్యారు. ఈ క్రమంలోనే త‌మ‌పై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, విచార‌ణ‌కు ఆదేశించొద్ద‌ని ఆ రెండు చాన‌ళ్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. ఇక నాయస్థానం ఆదేశాల మేర‌కు సీఐడీ కుట్ర‌కు సంబంధించి ఆధారాల‌ను వివ‌రంగా స‌మ‌ర్పించింది.

ఇక ఇందులో కొన్ని నమ్మలేని నిజాలు, ఆశ్చ‌ర్య‌క‌ర,‌ విష‌యాలు ఒక్కొక్క‌టిగా బయటపడుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ చంద్ర‌బాబు ఆదేశాల ప్రకారం ఎంపీ రఘురామ పిటిష‌న్ దాఖ‌లు చేశారని సిబిఐ నమ్మలేని నిజాలను బయటపెట్టింది.ఇందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను ఆధారాల‌తో స‌హా సుప్రీంకోర్టుకు సీఐడీ స‌మ‌ర్పించ‌డం రాష్ట్ర రాజకీయాల్లో సంచ‌ల‌నాలకు తెర తీస్తోంది. ఇక ఇది కాకుండా తాజాగా చంద్రబాబు, రఘురామకృష్ణరాజు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ జరిగినట్లు వాస్తవాలు బయటపడ్డాయి. వీరి చాటింగ్ లో..సార్‌… జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొత్త‌ వెర్షన్‌ ఇది. అన్ని పాయింట్లూ కవర్‌ చేశా అని రఘురామ చాట్ చేయటంతో దానికి చంద్రబాబు.. నాకు లేటెస్ట్‌ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా? అనటంతో వెంటనే రఘురామ వెంటనే పంపిస్తా సార్ అని రిప్లై ఇచారు. ఈ వాట్సాప్ చాటింగ్ వెనుక లోకేశ్‌ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకా ఆసక్తికరమైన విషయాలు కూడా రానున్నాయని తెలుస్తోంది.