Home రాజకీయాలు అఖిలేష్ యాద‌వ్‌, చంద్ర‌క‌ళ‌పై కేసులు.. అస‌లు కార‌ణ‌మిదే..!

అఖిలేష్ యాద‌వ్‌, చంద్ర‌క‌ళ‌పై కేసులు.. అస‌లు కార‌ణ‌మిదే..!

సార్వత్రిక ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌పై సీబీఐ విచారణ ఎదుర్కోనున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా వైరిపక్షాలు ఎస్పీ, బీఎస్పీ చేతుల కలిపి సీట్ల సర్దుబాటు చేసుకున్న రోజే సీబీఐ బృందాలు ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ఢిల్లిd, నోయిడా, హమిర్‌పూర్‌, లక్నో, జలౌన్‌ తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది.

రూ.12.5 లక్షల రూపాయల నగదు, 1.8 కిలోల బంగారు, విలువైన స్థిరచరాస్తుల డాక్యుమెంట్లు సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్‌ అధికారి బి. చంద్రకళ నివాసాలు ఇటు నోయిడా, అటు లక్నోలోనూ తనిఖీలు చేశారు. అఖిలేష్‌ ప్రభుత్వానికి ఐఎఎస్‌ అధికారి చంద్రకళ సన్నిహితురాలిగా పనిచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిన్న మొన్నటి వరకు ఆమె డైనమిక్‌ ఆఫీసర్‌ అని, అక్రమార్కుల పట్ల కఠినంగా ఉంటారని సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు.నిజాయితీపరురాలు, అవినీతి పరుల పాలిట సింహస్వప్నం అంటూ ప్రచారం చేశారు. విధి నిర్వహణలో డేరింగ్‌ డాషింగ్‌ ఆఫీసర్‌గా కూడా పేరు సంపాదించారు. అదే ఒరవడితోనే అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు తెరలేపి, భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై కొందరు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కథనం ప్రకారం 2012-16 మధ్యకాలంలో హమిర్‌పూర్‌ జిల్లాలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగాయి. ఆ సమయంలో అక్కడ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఐఎఎస్‌ అధికారి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేష్‌ కుమార్‌ మిశ్రా, 2017 ఎన్నికల్లో బీఎస్పీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన సంజయ్‌ దీక్షిత్‌లతోపాటు 11మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

ఎమ్మెల్సీ సోదరుడు దినేష్‌ కుమార్‌ మిశ్రా, మైనింగ్‌ శాఖలో పనిచేస్తున్న క్లర్క్‌ రామ ఆశ్రయ్‌ ప్రజాపతి, అంబికా తివారి, సత్యదేవ్‌ దీక్షిత్‌, రిటైర్డ్‌ మైనింగ్‌ క్లర్క్‌ రాం అవతార్‌ సింగ్‌, మైనింగ్‌ లీజుదారు కరణ్‌సింగ్‌, అక్రమ మైనింగ్‌ సరఫరాదారు అదిల్‌ ఖాన్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. 2013లో మైనింగ్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించిన గాయత్రి ప్రజాపతి సిఫారసులతో అదిల్‌ ఖాన్‌కు పనులు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి.

ఇసుక, ఇతర విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2012- 14 మధ్యకాలంలో 2008 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్‌ ఐఎఎస్‌ అధికారి చంద్రకళ హమిర్‌పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేశారు.

ఆ సమయంలో మైనింగ్‌ కాంట్రాక్టులకు సంబంధించి ‘ఈ-టెండర్‌’ విధానాలను పక్కనపెట్టి అక్రమార్కులకు కట్టబెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో అభియోగం. దాని ఆధారంగానే సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా శనివారంనాడు ఢిల్లిd, లక్నో తదితర 14 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 2012 నుంచి 2017 మధ్యకాలంలో యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్‌ యాదవ్‌ పనిచేశారు.

2012-13 సమయంలో మైనింగ్‌ మంత్రిత్వ శాఖ సీఎం అఖిలేష్‌ స్వయంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే హమిర్‌పూర్‌ జిల్లా మైనింగ్‌ కుంభకోణంలో అఖిలేష్‌ పాత్రపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. 2013లో మైనింగ్‌ శాఖను గాయత్రి ప్రజాపతికి కేటాయించారు. తదనంతరం జరిగిన పరిణామాల్లో ప్రధానంగా చిత్రకూట్‌లో ఓ మహిళపై అత్యాచారం కేసులో గాయత్రి ప్రజాపతి అరెస్టయ్యారు.

అక్రమ మైనింగ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు తాజాగా 2019 జనవరి 2న మూడో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగింది. 2016 జులై 28న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. 2017లో షవ్లిు, కౌషంబి జిల్లాల్లో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. సీనియర్‌ అధికారుల కథనం ప్రకారం ఫథేల్హ్‌పూర్‌, డియోరియా, సహరన్‌పూర్‌, సిద్ధార్థ నగర్‌ జిల్లాల్లో కూడా త్వరలో సీబీఐ దర్యాప్తు చేయనుంది. 2012-2016 మధ్య చోటుచేసుకున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై విచారణ చేపట్టనుంది. మైనింగ్‌ లీజు లేదా రిన్యూవల్‌ కోసం 2012 మే 31న అఖిలేష్‌ ప్ర భుత్వం ‘ఈ- టెండర్‌” విధానాన్ని తీసుకొచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad