YCP నేత, నటుడు, వ్యాపారవేత్త అయిన “మోహన్ బాబు”పై TDP నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు పరిశ్రమలో నట ప్రపూర్ణ అని చెప్పుకునే “మోహన్ బాబు” ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మా నాయకుడు చంద్రబాబు గారిపై బురదజల్లేందుకు మోహన్ బాబుకు ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బుద్ధా.. “పారితోషికం ఇవ్వనిదే మోహన్ బాబు ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఒక టాక్ ఉంది. తన గురువు అని చెప్పుకునే దాసరికే పంగనామాలు పెట్టిన వ్యక్తి ఈ మోహన్ బాబు అని సంచలన ఆరోపణలు చేశాడు. అక్కడితో ఆగని బుద్ధా, మోహన్ బాబు ఉత్తముడని “లక్ష్మీపార్వతి”తో స్టేట్మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ఈయన చరిత్ర చూస్తే సినిమాల్లో అవకాశాలు ఇప్పించిన నందమూరి తారకరామరావు గారినే మోసం చేశాడు. NTRకు “మేజర్ చంద్రకాంత్” సినిమా పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు.. అలాంటి ఆయన పారితోషికం లేకుండా జగన్ కు ఎలా సపోర్ట్ చేస్తాడు ? అందుకే ఈ 10 రోజులు జగన్ కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నాడని మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు బుద్ధా.