Home రాజకీయాలు గోల్కొండ టైగర్‌ బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్యం విషమం : హెల్త్ బులిటెన్ విడుదల

గోల్కొండ టైగర్‌ బద్దం బాల్‌రెడ్డి ఆరోగ్యం విషమం : హెల్త్ బులిటెన్ విడుదల

BJP సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు “బద్దం బాల్‌రెడ్డి” ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. బంజరాహిల్స్‌ లోని కేర్‌ హాస్పటల్ ల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని హాస్పటల్ సిబ్బంది శనివారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. “బద్దం బాల్‌రెడ్డి” గారిని హాస్పటల్ ల్లో పరామర్శించిన బీజేపీ MLA మీడియాతో మాట్లాడుతూ ..“ఈనెల 10వ తేదీన “బద్దం బాల్‌రెడ్డి” గారిని కేర్ హాస్పటల్ ల్లో చేరారు. ఆయనకు లివర్‌లో ప్రాబ్లమ్ ఉందని వైద్యులు చెప్పారు. గత 13 రోజులుగా ట్రీట్ మెంట్ చేస్తున్నారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి నేతలు మన మధ్య ఉండాలి” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

“బద్దం బాల్‌రెడ్డి” గారి రాజకీయ చరిత్ర చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కార్వాన్‌ నియోజకవర్గం నుండి ఏకంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాల్‌రెడ్డి. మరీ ముఖ్యంగా పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్‌రెడ్డిని తన అభిమానులంత “గోల్కొండ టైగర్‌”గా అని పిలుస్తారు. పాతబస్తీ “అలియాబాద్ జంగమ్మెట్” ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్‌ సిటీలో BJP పార్టీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు.

అప్పట్లో MIM వ్యవస్థాపకుడు “సలావుద్దీన్ ఓవైసీ”కి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్‌, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన ముఖ్య నాయకుల్లో “బద్దం బాల్‌రెడ్డి” ఒకరు. అందుకే ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి BJP అధిష్టానం పరిశీలించింది కూడా. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను “బద్దం బాల్‌రెడ్డి” రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad