త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల జాబితాను భారతీయ జనతపార్టీ విడుదల చేసింది. 182 మందితో తొలి జాబితాను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి “జేపీ నడ్డా” ప్రకటించారు. ఈ జాబితాలో తెలిపిన ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారని స్పష్టం అయ్యింది. ఇక BJP జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాత్రం.. ఈసారి ఆ పార్టీ అగ్రనేత “LK అడ్వాణీ” ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ BJP అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలిస్తే..
తెలంగాణ రాష్ట్రం అభ్యర్థులు…
మల్కాజ్గిరి – రామచంద్రరావు
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
మహబూబ్‌నగర్ – డీకే అరుణ
వరంగల్ – చింతా సాంబమూర్తి
నాగర్‌కర్నూలు – బంగారు శ్రుతి
నిజామాబాద్ – డి. అరవింద్
నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్
భువనగిరి – పీవీ శ్యామ్‌సుందర్ రావు
మహబూబాబాద్ – హుస్సేన్‌నాయక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు..
విశాఖపట్నం – పురందేశ్వరి
నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ