Home రాజకీయాలు టీడీపీకి బీజేపీ షాక్.. మొట్టికాయ వేయనున్న కోర్టు!

టీడీపీకి బీజేపీ షాక్.. మొట్టికాయ వేయనున్న కోర్టు!

cbn thumb 1

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని అంశంతో వేడెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రా రాజధానిని అమరావతి నుండి తరలించేందుకు సీఎం జగన్ సర్కార్ వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ఏపీకి ఒక్క రాజధాని కాకుండా ఏకంగా మూడు రాజధానులు ఉండాలని, ఆ దిశగా రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆమోద సంతకం కూడా సంపాదించింది ఏపీ సర్కార్. దీంతో ప్రతిపక్షమైన టీడీపీ తనవద్ద ఉన్న అన్ని అస్త్రాలను జగన్ సర్కార్‌పై విసిరేందుకు రెడీ అయ్యింది.

ఇందులో భాగంగా అమరావతి నుండి ఏపీ రాజధానిని తరలించడం అనైతికం, అన్యాయం అంటూ టీడీపీ హైకోర్టుకెక్కింది. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని కేవలం అమరావతి మాత్రమే ఉండాలని టీడీపీ పిటీషన్ దాఖలు చేసింది. అయితే టీడీపీకి షాకిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వాధీనంలో మాత్రమే ఉంటుందని బీజేపీ తేల్చేసింది.

దీంతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తమకు రాజధాని విషయంలో అండగా నిల్చుంటుందని బాబు ప్లాన్ చేయగా, ఇప్పుడది బెడిసి కొట్టింది. ఇక బీజేపీ వివరణతో హైకోర్టు టీడీపీకి మొట్టికాయలు వేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇలా రాజధాని ఎంపికలో తనదైన మార్క్ వేసుకుంటుండగా టీడీపీ దానికి అడ్డు పడటంత ఏమాత్రం సమంజసం కాదని కోర్టు తీర్పు ఇవ్వనుందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం కోర్టు ఇచ్చే తీర్పుపై ఏపీ ప్రజల భవిష్యత్తు ఉందనేది వాస్తవమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad