Home రాజకీయాలు జాతీయ వార్తలు ఫేస్‌బుక్ నిషేధం..రచ్చ లేపుతున్న రాజాసింగ్: విశ్లేషణాత్మక కథనం

ఫేస్‌బుక్ నిషేధం..రచ్చ లేపుతున్న రాజాసింగ్: విశ్లేషణాత్మక కథనం

thequint 2020 08 7555182d 1abd 4a33 b21f ecf20963dc46 fb

ప్రస్తుతం ఫేస్ బుక్ వ్యవహార తీరు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది.ఫేస్ బుక్ యాజమాన్యం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కంటెంట్ మానిటర్ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. గతవారం వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ ఆర్టికల్ ను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఫేస్ బుక్ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో ఫేస్ బుక్ నష్ట నివారణ చర్యలు చెప్పట్టింది.

తాజాగా రాజా సింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను నిషేధించినట్లు ఫేస్‌బుక్ సంస్థ ప్రకటించింది. దీంతో ఫేస్ బుక్ ఒక్కసారిగా రాజకీయ దుమారానికి తెర తీసినట్లు అయ్యింది. కాగా తన ఫేస్ బుక్ ఖాతాల నిషేధంపై రాజాసింగ్ స్పందించారు. “ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఫేస్ బుక్ ఎకౌంట్ లేదని వారు తెలిపారు. గతంలో ఒక ఎకౌంట్ ఉన్నప్పటికీ అది హ్యాక్ కు గురికావడంతో అకౌంట్ ను మూసివేసినట్టు రాజాసింగ్ తెలిపారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే ఫేస్‌బుక్ పని చేస్తోందా అని ప్రశ్నించారు. నా దగ్గర ఫేస్ బుక్ ఎకౌంట్ ఏ లేనప్పుడు ఫేస్ బుక్ యాజమాన్యం ఏ పేజీని బ్లాక్ చేశారో చెప్పవలసిందిగా వారు కోరారు.  

ది వాల్‌స్ట్రీట్ జర్నల్ :

తాజాగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు రాజకీయాల్లో వేడిని రాజేస్తున్తుంది. ఆ కథనం సారాంశం ఏంటంటే.. భారతదేశంలో బీజేపీ నాయకులు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్ బుక్ మరియు దాని అనుబంధ సంస్థలు చూసీచూడనట్లు వదిలేస్తోందని  వాల్‌స్ట్రీట్ ఆరోపించింది. కథనాన్ని పూర్తిగా సమీక్షించిగా “ అంఖీ దాస్‌ అనే ఫేస్‌బుక్‌ సంస్థ ప్రతినిధి తమ సంస్థ ఉద్యోగులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలను బ్లాక్ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారంట. అందులో హేట్ స్పీచ్ ఉన్నప్పటికీ వాటిని అనుమతించాలని సదరు అధికారి ఉద్యోగులు తెలిపినట్టు వాల్‌స్ట్రీట్ వార్తా కథనాన్ని ప్రచురించింది.

తాజాగా ఫేస్ బుక్ ఉద్యోగులు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. అయితే సంస్థ ప్రతినిధులు మాత్రం వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంటే బీజేపీ నేతలు ఫేస్‌బుక్, వాట్సప్‌లను నియంత్రిస్తున్నారని అర్ధం. 

ఎందుకలా?

ప్రపంచంలో ఎక్కువ సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు భారతదేశంలోనే ఉన్నారు. ప్రధానంగా ఫేస్ బుక్ కు లభించే ఆదాయ లో భారతదేశం ద్వారానే ప్రతియేడాది 1.6 బిలియన్ డాలర్లు లభిస్తున్నాయి. ఒక వేల బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే ఇండియాలో ఫేస్ బుక్ బిజినెస్‌ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలకు హేట్‌ స్పీచ్‌ రూల్స్‌ను అమలు చేయవద్దని ఫేస్ బుక్ పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. 

రాజకీయ ప్రకంపనలు :

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆరెస్సెస్‌లపై విమర్శనాస్త్రాలను సంధించారు. “ఫేస్‌బుక్‌, వాట్సప్‌ బీజేపీ, ఆరెస్సెస్‌ అదుపులో ఉన్నాయని అన్నారు. ఈ సంస్థ ఫేక్‌ న్యూస్‌, విద్వేషాలను రెచ్చగొట్టడంలో బీజేపీకి సహకరిస్తున్నాయి, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి” అని ట్విటర్‌ వేదికగా ఆరోపించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేత కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో “కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ద్వారా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని దొంగలించి ఎన్నికల్లో ఉపయోగించుకోడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా ?” అని రవిశంకర్ ప్రసాద్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా : 

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియన్ కాంగ్రెస్ మరియు అమెరిక రాజకీయ పార్టీలు కేంబ్రిడ్జ్ ఎనలిటికా ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డాక్టర్.అలెగ్జాండర్ కోగన్‌కు చెందిన జీఎస్ఆర్ సంస్థ.. ఫేస్‌బుక్‌లో ఒక పర్సనాలిటీ క్విజ్‌ గేమ్  ద్వారా దాదాపు 8.7కోట్ల మంది డేటాను సేకరించింది. ఈ డేటాను జీఎస్ఆర్, కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో పంచుకుంది. కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ఈ డేటాను రాజకీయ ప్రకటన కోసం వినియోగించి ఓటర్లను ప్రభావితం చేసింది. 2014లో కాంగ్రెస్ ఈ డేటాను వినియోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. తరువాత వీటిపై పక్కా ఆధారాలు దొరికాయి.

అక్రమంగా ఫేస్ బుక్ డేటా వినియోగించే ప్రజలు వారి వ్యక్తిగత సమాచారం మరియు వారి పర్సనల్ ఇంట్రెస్ట్ ను గుర్తించి తద్వారా రాజకీయ వ్యూహాలను రూపొందించారు.దీని కోసం కాంగ్రెస్ అప్పట్లో భారీగా డబ్బును చెల్లించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందని ఆరోపణలును వస్తున్నాయి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad