Home రాజకీయాలు పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ CM గా చూడాలని నా కోరిక : బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ CM గా చూడాలని నా కోరిక : బండ్ల గణేష్

ఆమద్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సినీ నటుడు, నిర్మాత “బండ్ల గణేష్” ఎంత హాట్ టాపిక్ అయ్యడో తెలిసిందే.. కాంగ్రెస్ లో చేరినా ఆయన తెలంగాణ రాష్ట్రంలో TRS పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని.. 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి, ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది.. అదే గనక జరగకపోతే మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి 7 “0” క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటా అని శపథం చేశాడు. దాంతో బండ్ల హాట్ టాపిక్ అయ్యాడు.

పరిస్థితి చూస్తే కాంగ్రెస్ గెలిచేలా ఏమాత్రం కనిపించడం లేదు. బండ్ల గణేష్ మాత్రం మీడియా ముందే చ్యాలెంజ్ లు చేస్తున్నాడు. దాంతో ఏం జరుగుతుందా ? అని అందరూ ఎదురుచూశారు. కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. కాంగ్రాస్ ఓడిపోయింది. విషయం తెలుసుకున్న గణేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో కొన్ని మీడియా సంస్థలు గణేష్ ఎక్కడా అని బ్లేడ్ పట్టుకొని ఎదురు చూశారు. కానీ ఆయన మాత్రం దొరకలేదు.

అనుకోకుండా ఒకరోజు తిరుమలలో ప్రత్యేక్షం అయినను మీడియా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. దాంతో విసిగిపోయిన బండ్ల ఏదో మా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుదాం అని చెప్పా… అంతా మాత్రనా ఇప్పుడు చనిపోమంటారా  చెప్పండి ? అంటూ మాట మార్చాడు. ఆరోజు కనిపించిన బండ్ల మళ్ళీ ఎప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అలాంటి ఆయన ఇప్పుడు తన దైవం “పవన్ కళ్యాణ్” ను ఉద్దేశించి ఒక పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో గణేష్ కోరిక అందరికీ నచ్చడంతో ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

“నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు…. నా దైవం, నా బాస్.. పవన్ కల్యాణ్ గారిని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి…. మీ బండ్ల గణేష్” అంటు పెట్టిన ఈ పోస్టు ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఇక పవన్ అభిమానులైతే బండ్ల గణేష్ గారు మీ కోరిక నిజం కావాలని మేమంతా కోరుకుంటున్నాం అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad