Home రాజకీయాలు రామ నామంతో హోరెత్తుతున్న అయోధ్య...

రామ నామంతో హోరెత్తుతున్న అయోధ్య…

Ram mandir

వందల సంవత్సరాల నిరీక్షణకు ఫలితం దక్కింది, హిందువుల పుణ్యక్షేత్రమైన అయోధ్యలో
రామమందిర నిర్మాణానికి శుభ ముహూర్తం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో అయోధ్యలో రామజన్మ భూమి పూజకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ అయోధ్య దీపాల వెలుగులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. మరో వైపు రామభక్తుల కీర్తనలతో అయోధ్య సర్వాంగసుందరంగా తయారైంది.

రామమందిర శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం రామమందిర నిర్మాణం ”మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో” ఉండనుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో నరేంద్ర మోడీ అడుగుపెట్టి నేటికీ 28 సంవత్సరాలు అవుతుంది. 1992 జనవరి 18న అయోధ్యను సందర్శించిన ఆయన, మరల రామమందిర నిర్మాణం అప్పుడే అయోధ్యలో అడుగుపెడతానని శపథం చేశారు. అనుకున్న విధంగానే తన మాటను నిరూపించుకొని నేడు అయోధ్యలో అడుగుపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని అధికారులు పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఇప్పటికే అయోధ్యను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర,రాష్ట్ర బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి . ఉగ్ర ముప్పు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 3,500 మంది పోలీసులు ప్రత్యేకంగా విధుల్లో ఉండనున్నారు. ఈ వేడుకకు కేవలం 175 మందికి మాత్రమే రానున్నారు.

మోదీ గత ఎన్నికల్లో ప్రకటించిన విధంగానే జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్ 370ను రద్దు, రామజన్మభూమి నిర్మాణం అన్ని ఒకేసారి జరిగాయి. ఢిల్లీ నుండి 9.30 గంటలకు బయలుదేరనున్న మోదీ 12.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. తరువాత 2.20 గంటలకు లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నట్టు యూపీ సర్కార్ తెలిపింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad