Home రాజకీయాలు ఏపి వార్తలు మాజీ మంత్రి అచ్చం నాయుడుకి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి అచ్చం నాయుడుకి బెయిల్ మంజూరు

achennayudu

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. గతనెల ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కుంభకోణంలో అరెస్ట్ అయినా అచ్చన్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పునిచ్చింది. గత కొంత కాలంగా కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న అచ్చం నాయుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానం ఆ పిటిషన్ ను  కొట్టివేసింది. తాజాగా మరోసారి బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అచ్చం నాయుడు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థి లోద్ర, హైకోర్టు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల షూరిటీ ఇవ్వడంతోపాటు. దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కేసును ప్రభావితం చేసేలా ప్రవర్తించిన, సాక్షులను భయబ్రాంతులకు గురి చేసిన బెయిల్ ను వెంటనే రద్దు చేస్తామని తెలిపింది. తప్పనిసరిగా దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని కోర్టు ఆదేశించింది. మూడు రోజుల క్రితమే వాదనలు పూర్తిగా నేడు కోర్టు తీర్పు ఇచ్చింది.

గత టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నా అచ్చం నాయుడు దాదాపు 150 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్‌ఐ డైరెక్టర్లు, ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై కోట్ల రూపాయిలు దారి మళ్లించినట్లు ఏసీబీ ఆధారాలతో బయటపెట్టింది. 2014 నుండి 2019 మధ్య ఈఎస్ఐ మందులు కొనుగోలులో ప్రభుత్వం 970 కోట్లను కేటాయించగా. అందులోని రూ.151 కోట్ల మొత్తం అదనపు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. టెండర్లు పిలవడం, మందులు కొనుగోలులో భారీ గోల్ మాల్ జరిగినట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అచ్చం నాయుడుతో పాటు మొత్తం పన్నెండు మందిని అరెస్టు చేసింది. ఇందులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా నిందితుడిగా ఉన్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad