
బొమ్మలతో పిల్లలు ఆడుకుంటూ ఉండటం సహజం. నిజమైన వస్తువులను పోలి ఉండేలా వాటిని డిజైన్ చేసి వినియోగదారులను ఆకర్షించి అమ్మేస్తుంటారు. కానీ కొందరు చేసే బొమ్మలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. నిజమైన వస్తువులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. అలాంటి బొమ్మలనే తయారు చేస్తున్నారు కేరళకు చెందిన అరుణ్‌కుమార్ అనే యువకుడు. ఇడుక్కి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు అరుణ్‌కుమార్. చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టం. తాతయ్య దగ్గర బొమ్మల తయారీ నేర్చుకున్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బుజ్జి జీపు కూడా అరుణ్‌కుమార్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. చిన్నసైజులో బొమ్మలా తయారు చేసి దానికి ఇంజిన్ మెకానిజం ఏర్పాటు చేసేశాడు. నిజానికి ఇది తన పిల్లల కోసం చేసుకోలేదు. ఒక పదేళ్ల బాలుడి కోసం చేశాడు. అంతకు ముందే ఓ బుల్లి ఆటోని తయారు చేసి దాన్ని తనకున్న య్యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకున్నాడు. దానిక విపరీతంగా లైకులు, షేర్లు వచ్చాయి. దాదాపు 1.8 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఆ బుజ్జి ఆటోను చూసిన ఓ పదేళ్ల బాలుడు….అరుణ్‌కుమార్ దగ్గరకు వచ్చి తనకు ఒక జీపు చేయాలని కోరాడు. మొదట్లో పని ఒత్తిడి వల్ల అరుణ్ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ పిల్లవాడికి ఏదో జబ్బు ఉందని తెలిసిన తర్వాత తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంత డబ్బు తన వద్ద లేదు. విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. దీంతో తన ఫ్రెండ్స్, బంధువులు తలా కొంత డబ్బుసాయం చేశారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు కష్టపడి ఇదిగో ఇలా జీపును తయారు చేసేశాడు. ఈ జీపు చూడటానికి ఒరిజినల్ జీపులానే ఉంటుంది. ఇందులో మ్యూజిక్ ప్లేయర్, ఫోన్ చార్జర్ ఆప్షన్ కూడా ఉంది.
అరుణ్ కుమార్ ది చాలా పెద్ద కుటుంబం. తాతాయ్య దగ్గర నుంచి ఈ పని నేర్చకున్నాడు. చిన్నప్పుడు నుంచి బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ బొమ్మలు చేసినందుకు గాను ఆయనకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా వచ్చింది. అయితే ఇలా బొమ్మలు తయారు చేయడానికి బలమైన కారణం కూడా ఉంది. ఒకసారి అరుణ్ సూపర్ మార్కెట్ కి వెళ్లినప్పుడు అతని కుమారుడు…. ఒక బొమ్మకారు చూసి అది కొనమని అడిగాడు. కానీ దాని విలువ 16 వేలు రూపాయలు. దీంతో తనకు కొనాలని అనిపించలేదు.
ఎందుకంటే…..అతను చిన్నప్పుటి నుంచే బొమ్మలు చేసేవాడు. అందుకే వాటి విలువ అతనికి తెలుసు. బొమ్మలు చేసేప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. సమయం కూడా వృధా అవుతుంది. అది ప్రత్యక్షంగా చూస్తే తన పిల్లలకు కూడా వాటి విలువ తెలుస్తుందని భావించాడు. అందుకే స్వయంగా తానే తాయరు చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ జీపును తయారు చేసి వీడియో కాల్ లో రోగంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడికి చూపించడంతో….అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ దాని డెలీవరీ చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టింది.
ఇప్పుడు తన పిల్లలు స్కూల్ లో సూపర్ స్టార్స్ అయ్యారు. మినీ బైక్, ఆటోలను నడిపేందుకు వారంతా …..మా ఇంటికి వస్తుంటారని చెబుతున్నాడు. ఆ జీపు ప్రముఖ వ్యాపారవేత్త ఆనందమహీంద్రను దృష్టిని కూడా ఆకర్షించింది. అందుకే ట్వీట్ కూడా చేశాడు. దానికి ఆ వీడియో జోడించి..ఎవరు ఇతను అతని కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి…అతనికి ఆసక్తి ఉంటే ఇలాంటి చిన్న సైజు బొమ్మలను తయారు చేసి అవకాశం కల్పిస్తామని అన్నారు.
అయితే అరుణ్‌కుమార్‌కి ప్రస్తుతానికి ఆలోచనేమీ లేదట. ఇడుక్కి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్నాడు. అప్పటి నుంచి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. తనకు ఏదైనా అవకాశం వస్తే మాత్రం…… చిన్న ఫ్యాక్టరీ పెడతానని చెబుతున్నాడు.